చిరంజీవి వల్ల రామ్ చరణ్ అంత బాధ పడ్డాడా..

- Advertisement -

చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ప్రత్యేక పరచయాలు అక్కర్లేని హీరో.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలాడు. అలాంటి హీరో వారసుడిగా ఇండస్ట్రీ లోకి రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక రామ్ చరణ్ ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతూ సినిమాల్లో కొనసాగుతున్నారు.ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. అంతే కాకుండా ఆస్కార్ ను సొంతం చేసుకుంది.

చిరంజీవి
చిరంజీవి

అయితే ఇంత సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న చరణ్ ఒక సినిమా వల్ల అట్టర్ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. కాగా ఇలా వరుస సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న చిరంజీవి ..చరణ్ సినిమాలలో ఒక సినిమాను ఎందుకు చేశాడు రా అంటూ ఇప్పటికి బాధపడుతున్నాడట. అంతేకాదు ఆ సినిమాని స్వయనా యాక్సెప్ట్ చేసింది చిరంజీవి కావడంతో మరింత బాధపడుతున్నారట. అటు చరణ్ కూడా ఆయన నిర్ణయాన్ని కాదనలేక చేసిన సినిమా వల్ల చాలా బాధపడ్డాడుట. ఆ సినిమా మరేదో కాదు సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన జంజీర్ . హిందీలో జంజీర్.. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త టాక్ ని సంపాదించుకుంది.

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రా కు రామ్ చరణ్ తమ్ముడు లా ఉన్నాడంటూ కామెంట్స్ కూడా వ‌చ్చాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ నటన డిజాస్టర్ అంటూ మెగా ఫాన్స్ సైతం ఆయన పై మండిపడ్డారు. అయితే మొదట ఈ కథను విన్నప్పుడు చిరంజీవికి ఈ స్టోరీ రామ్ చరణ్ కు బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. కాగా డైరెక్షన్లో ఫాల్ట్ కారణంగా సీన్స్ మార్చేస్తూ చరణ్ కు నటించే స్కోప్ లేకుండా ఒకే కంటెంట్ తీసుకెళ్లారని ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచిందని ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here