Chiranjeevi : ‘విరూపాక్ష’ సక్సెస్ ని చూసి ఎమోషనల్ అయిపోయిన చిరంజీవి.. అల్లుడి మీద ఇంత ప్రేమనా!

- Advertisement -

Chiranjeevi : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన హారర్ సినిమాని చూసిన అనుభూతి కలిగింది అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు.బైక్ యాక్సిడెంట్ తర్వాత ఎంతో ఇబ్బంది పడిన సాయి ధరమ్ తేజ్ కి ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ ఆయనకీ మంచి ఊపుని ఇచ్చిందని చెప్పాలి.

chiranjeevi
chiranjeevi

ఇక సాయి ధరమ్ తేజ్ కుటుంబ సబ్యులకు ఎంత ఆనందంగా ఉంది ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సాయి ధరమ్ తేజ్ చావు బ్రతుకు మధ్య పోరాడిన సందర్భం చూసి మెగా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకోని రోజంటూ లేదు,అలాంటిది ఏడాది తిరిగేలోపు సినిమాల్లో నటించి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటుంది.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నిన్న ట్విట్టర్ లో ఎమోషనల్ గా పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘విరూపాక్ష చిత్రానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.నా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ని చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది.అతని కం బ్యాక్ సినిమా ఆడియన్స్ అందరి చేత శబాష్ అనిపించింది.ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తో పాటుగా మూవీ టీం కి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ ఆయన పెట్టిన ఒక ట్వీట్ నిన్న వైరల్ గా మారింది.

- Advertisement -

దానికి సాయి ధరమ్ తేజ్ కూడా ఎంతో ఎమోషనల్ గా రిప్లై ఇచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘నా సినిమా విజయం సాధించడం చూసి పెద్ద మామయ్య చిరంజీవి మరియు చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేయడం, జీవితాంతం నేను గుర్తించుకునే మెమరీ గా మిగిలిపోతుంది’ అంటూ సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ట్వీట్ వేస్తాడు, ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా సాయి ధరమ్ తేజ్ ని విష్ చేసాడు, ఆయన ప్రస్తుతం ముంబై లో OG మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.అయ్యినప్పటికీ కూడా మర్చిపోకుండా సాయి ధరమ్ తేజ్ కి బొకే పంపి శుభాకాంక్షలు తెలియచేసాడంటే, అల్లుడి మీద ఆయనకీ ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.అలా మెగా కుటుంబం మొత్తం సాయి ధరమ్ తేజ్ గ్రాండ్ సక్సెస్ కొట్టడం పై సంబరాలు చేసుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here