Taraka Ratna : తుదిశ్వాస విడిచిన నందమూరి తారకరత్న..శోకసంద్రం లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు

- Advertisement -

Taraka Ratna : ఇటీవల కాలం లో సినీ అభిమానులను మరియు నందమూరి అభిమానులను భయాందోళనకు గురి చేసిన సంఘటన నందమూరి తారకరత్న కి గుండెపోటు రావడం..తన భావ నారాలోకేష్ తో పాటుగా పాదయాత్ర కార్యక్రమం లో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడం ఆ తర్వాత వెంటనే ఆయనని సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం.

Taraka Ratna
Taraka Ratna

అక్కడ ఆయన పూర్తిగా కోలుకోలేకపొయ్యేసరికి వెంటనే ఆయనని బెంగళూరు కి తరలించడం జరిగింది..అక్కడ ఆయనకీ స్పెషలిస్ట్స్ చేత చికిత్స అందించినప్పటికీ కొన్ని గంటల పాటు మ్ర్యుతువుతో పోరాడి చివరికి తన తుది శ్వాసని విడిచాడు..ఈ ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..ఎంతో మనిషి అని పేరున్న నందమూరి తారకరత్న కి ఇలా జరగడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..ముఖ్యంగా నందమూరి కుటుంబ సబ్యులకు ఎంత బాధ ఉంటుందో మాటల్లో వర్ణించలేము.

ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులందరూ బెంగళూరు లోని నారాయణ హాస్పిటల్స్ చేరుకున్నారు..జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తారకరత్న కి సీరియస్ కండిషన్ ఉందని తెలిసిన వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారు.. బాలయ్య అయితే రెండు రోజుల నుండి నిద్రాహారాలు మానేసి తారకరత్న కోసం హాస్పిటల్ లోనే ఉంటున్నాడు.. నిన్ననే చంద్రబాబు నాయుడు హాస్పిటల్ వద్దకి వచ్చి తారక రత్న కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -
Actor Taraka Ratna
Actor Taraka Ratna

లక్షలాది మంది నందమూరి అభిమానులు తారకరత్న కోలుకోవాలని పూజలు చేసారు.. కానీ ఫలితం లేకుండా పోయింది.. నందమూరి కుటుంబం నుండి హీరో గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారకరత్న పెద్దగా కమర్షియల్ సక్సెస్ లు చూడకపోయినప్పటికీ వ్యాపార రంగం లో గొప్పగానే రాణించాడు.. ఇటీవలే రాజకీయ అరంగేట్రం కూడా చేసిన తారకరత్న కి ఇలా అకస్మాత్తుగా జరగడం బాధాకరం..ఆయన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here