Rakul Preeth : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరో సందీప్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.. ఆ సినిమాలో బబ్లీగా,హొమ్లీ గా కనిపించి అందరి మనసును దొచుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.అందులో కొన్ని భారీ హిట్ ను అందుకుంటే మరి కొన్ని మాత్రం బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది… మూడు పదుల వయస్సు దాటిన రకుల్ ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యింది. తాను ప్రేమించిన వ్యక్తినే అమ్మడు పెళ్ళాడబోతుంది.. ఈ విషయం పై రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి..
![Rakul Preeth](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2022/12/images-2022-12-28T090303.217.jpeg)
ఇకపోతే ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తక్కువ వస్తున్నాయి..అందుకే బాలివుడ్ సినిమాలను చేస్తుంది.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకోవడం కోసం ఈ అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ ఈ ఏడాది రకుల్ కు ఏమాత్రం కలిసి రాలేదు..ఎక్కడ చూసినా హిట్ పడలేదు..
![Jackie Bhagnani](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2022/12/images-2022-12-28T090306.719.jpeg)
ఈ ఏడాదిలో రకుల్ నుంచి ఐదు సినిమాలు బాలీవుడ్ లో విడుదలయ్యాయి. అయితే ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయింది. దీంతో వచ్చే ఏడాది అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతోంది. ఇకపోతే రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఈ జంట.. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్స్, డిన్నర్ డేట్స్ అంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది..
![Birthday Celebrations](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2022/12/n45608745816721977902149f5fedb100e3b57c2347df4a5cb3c0c6c4f0cbbc68f5618b41e9bcc347183c0e-jpg.webp)
డిసెంబర్ 25న జాకీ భగ్నానీ బర్త్‌డే వేడుకలు రకుల్ తో కలిసి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. శాంటా నా జీవితానికి ఉత్తమమైన బహుమతిని అందించాడు. అది నువ్వే. ఈ రోజు మై లవ్ జాకీ భగ్నానీ పుట్టిన రోజు కావడం సంతోషంగా ఉంది. ఎప్పటికీ నీ వెంటే ఉంటా
అంటూ రొమాంటిక్ పిక్ తో రకుల్ ప్రియుడిని ఇన్‌స్టా ద్వారా విష్ చేసింది.. ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అవుతున్నారంటూ తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇటు రకుల్‌తో పాటు అటు జాకీ తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారట. ఇక పేరెంట్స్ ఒత్తడి తట్టుకోలేక జాకీ, రకుల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వచ్చే ఏడాది సమ్మర్ లో వీరి వివాహం జరగబోతోందట. ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను వీరిద్దరు పూర్తి చేయనున్నారు..