Rakul Preet Singh : బీచ్ లో రకుల్ గ్లామర్ షో.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్రకుల్ ప్రీత్ సింగ్.. మొన్నటిదాకా టాలీవుడ్ ను దున్నేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో మకాం వేసింది. బీ టౌన్ కు వెళ్లాక ఈ భామ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.
సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలోనూ తన హవా చాటుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్ట్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. న్యూ ఇయర్ వెకేషన్ లో ఉన్న రకుల్.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎల్లో కలర్ బీచ్ డ్రెస్సులో రకుల్ గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నేచురల్ బ్యూటీ రకుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ బ్యూటీకి గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన సక్సెస్ లేదు. ప్రజెంట్ ఈ భామ ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. ప్రస్తుతం అక్కడ కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ శంకర్ ఇండియన్ 2 సినిమాతో పాటు బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది.