Rajamouli : ఏంది జక్కన్న.. ఏం మాట్లాడుతున్నావు.. నరాలు కట్ అయిపోతున్నాయి.. నాటు నాటు లో నీ క్రెడిట్ లేదా

- Advertisement -

Rajamouli: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. అనేక రికార్డులను కూడా సొంతం చేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టిఆర్ కొమరం భీమ్ గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు..

Rajamouli
Rajamouli

చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను స్నేహితులుగా మార్చి ఫిక్షనల్ కథతో ఈ సినిమాను రూపొందించారు రాజమౌళి. ఇక ఈ సినిమా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని పెంచేసింది.. జపాన్ లోను విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గ్లోబల్ అవార్డు దగ్గర ఆస్కార్ నామినేషన్ లో కూడా ఈ పాట నామినేట్ అయింది..

అయితే ఈ పాట క్రెడిట్ అంతా రాజమౌళికి , సంగీత దర్శకుడికి మాత్రమే దక్కుతుందని కొందరు ట్రోల్ చేస్తున్నారు.. గత కొద్ది రోజులుగా ఈ ట్రోల్స్ ఎక్కువగా కావడంతో ఈ విషయంపై రాజమౌళి స్పందించారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాట క్రెడిట్ అంతా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కే దక్కుతుందని తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాటు నాటు పాట కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ చాలా కష్టపడ్డారు. అతను అంత ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టే ఆ పాటకు అంతటి గౌరవం దక్కిందని తెలిపారు. అదేవిధంగా రామ్ చరణ్ ను తారక్ భుజాలపై ఎత్తుకొని చేసే ఫైట్ కూడా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేశారని రాజమౌళి తెలిపారు.

ప్రస్తుతం రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్ని రోజుల నుంచి నాటు నాటు పాట క్రెడిట్ అంతా కూడా రాజమౌళికి దక్కుతుంది అని అనుకుంటుండగా.. ఇప్పుడు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కి అని చెప్పగానే ఏంది జక్కన్న.. ఏం మాట్లాడుతున్నావు.. నరాలు కట్ అయిపోతున్నాయి నాటు నాటులో నీకు క్రెడిట్ లేదా.. నువ్వే చెప్పావు కాబట్టి ఓకే.. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here