Sobhita Dhulipala : 66 ఏళ్ల ముసలి హీరోతో శోభిత ఘాటు లిప్ లాక్..ఫ్యాన్స్ ఫైర్..

- Advertisement -

Sobhita Dhulipala గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. తెలుగు హీరోయిన్ అయినా బాలివుడ్ లో మాత్రం హాట్ సీన్లలో నటిస్తూ ఓ రేంజులో రచ్చ చేస్తుంది.. బొల్డ్ సీన్స్ తో రెచ్చిపోతోంది. అది కూడా ఏ యంగ్ హీరోతోనే కాదు 66 ఏళ్ళ సీనియర్ హీరోతో ఘాటు రొమాన్స్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..తెలుగు ఆడపిల్ల శోభిత ధూళిపాళ. బాలీవుడ్ తెరపై హీరోయిన్ గా వెలుగుతోంది. వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసుకుంటూ రెచ్చిపోతోంది. ఇటు సౌత్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది శోభిత. కాని ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. బోల్డ్ సీన్స్.. లిప్ లాక్స్ అంటే ఏమాత్రం తగ్గడంలేదు తెనాలి అమ్మాయి.. మొత్తానికి ఇప్పుడు ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది.

Sobhita Dhulipala
Sobhita Dhulipala

మొన్నమధ్య అక్కినేని హీరో నాగచైతన్యతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది బ్యూటీ. చైతూని పెళ్ళాడబోతుంది అని రూమర్ కూడా గట్టిగా వినిపించింది. కాని ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అనౌన్స్ మెంట్ వినిపించలేదు. ఈక్రమంలో.. నాగచైతన్యప్లాట్ ముందు శోభిత కారు ఉండటంతో.. ఆడియన్స్ వీరి రిలేషన్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అంతేకాదు వీరిద్దరి గురించి రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి సినిమాలు చేసిన శోభిత.. బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతోంది. ఇప్పటి వరకూ ఆమె బాలీవుడ్ లో దాదాపుగా బోల్డ్ పాత్రలే చేస్తూ వస్తోంది.

sobhita dhulipala anil kapoor
sobhita dhulipala anil kapoor

ఇక ఈ క్రమంలోనే శోభిత తాజా గా మరింతగా రెచ్చిపోయింది. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ వెబ్ సిరీస్ లో హాట్ కిస్సులతో రెచ్చిపోయింది. అది కూడా ఏ కుర్ర హీరోతోనో కానే కాదు. 30 ఏళ్ళ శోభిత 66 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనీల్ కపూర్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. దాంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. అంతే కాదు పలు విమర్షలకు కూడా దారితీస్తోంది.

- Advertisement -

ఈ వెబ్ సిరీస్ లో ఆమెను కేవలం ముద్దుల కోసమే తీసుకున్నా.. బికినీ వేసుకుని రొమాంటిక్ సీన్స్ కోసమే ఆమెను తీసుకున్నారా అంటూ ఫ్యాన్స్ ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు.. ఇక సౌత్ నుంచి శోభిత ధూళిపాల పొన్నియిన్ సెల్వన్ 1లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఓటీటీ మూవీలకు శోభిత కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 లో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరి 30 ఏళ్ల శోభిత.. 66 ఏళ్ల వ్యక్తితో రోమాన్స్ చెయ్యడంపై రచ్చ మాత్రం జరుగుతూనే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here