Prabhas Unstoppable 2 : బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

- Advertisement -

Prabhas Unstoppable 2  : సినీ ఇండస్ట్రీలో కొంతమంది సినిమాలతో మాత్రమే కాదు..వారు వేసుకొనే డ్రెస్ నుంచి చెప్పుల వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు..ఇక స్టార్ హీరో, హీరోయిన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..కళ్ళు చెదిరే ధరలతో వస్తువులను కొంటారు. వాటి ధరలను చూసి చాలా మంది షాక్ అవుతారు.నిత్యం సోషల్ మీడియాలో ఏదొక స్టార్ ఇలా వార్తల్లొ నిలుస్తుండటం మనం చూస్తునే ఉన్నాం.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది..

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఇటీవల సెకండ్ సీజన్ ను కూడా ప్రారంభించారు.ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ షో తాజా ఎపిసోడ్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నారు.

Prabhas Unstoppable 2
Prabhas Unstoppable 2

డార్లింగ్ ప్రభాస్ ఇటువంటి టాక్ షోలకు, టీవీ షోలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటిది ఆయన బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు. పైగా బాలయ్యతో ప్రభాస్ తొలిసారి తెరపై కనిపించబోతున్నారు. దాంతో అందరి చూపులు ఈ షో పైన పడ్డాయి. తాజాగా అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆహా టీం ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా ఆహా టీమ్ పేర్కొంది. దీంతో ఆహా వారు తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

ఇది ఇలా ఉండగా.. ఈ షోలో ప్రభాస్ ధరించిన షర్ట్ కాస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ వేసుకున్న షర్ట్ హాట్ టాపిక్ అయ్యింది. కొత్త హెయిర్, కాస్త పెంచిన గెడ్డంతో చాలా హ్యాండ్సమ్గా కనిపించారు. కలర్ ఫుల్ షర్ట్ లో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు, ఆ షర్ట్ బ్రాండ్ అండ్ కాస్ట్ డీటేల్స్ వెతికే పనిలో పడ్డారు. అయితే ప్రభాస్ వేసుకున్నది పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్.

ఈ షర్ట్ కాస్ట్ 115 పౌండ్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,618.09 అన్నమాట. ధర విని షాక్ అయ్యారు కదా..మీరు విన్నది మాత్రం నిజం.. దీంతో చాలా సింపుల్ గా కనిపిస్తున్న ప్రభాస్ షర్ట్ అంత కాస్ట్లీనా అంటు జనాలు చెవులు కొరుక్కుంటూన్నారు.. మొత్తానికి డార్లింగ్ వార్తల్లో నిలిచాడు..ఈ షో ఫుల్ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు..ఇదే కాదు..గతంలో చాలా కాస్ట్లీ వస్తువులను వాడారు..సినిమాల విషయానికొస్తే.. ఆధిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల్లో నటిస్తున్నాడు.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here