Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల కేజీయఫ్ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ – సీజ్ ది ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి పార్ట్ -2 కూడా తెరకెక్కనుంది. సలార్ తర్వాత ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో ఇంతకాలం గ్యాప్ తీసుకున్నాడు. ఇక తాజాగా కోలుకున్న ఈ స్టార్ తన నెక్స్ట్ మూవీ రాజాసాబ్ కోసం రంగంలోకి దిగాడు.

తన కాలికి శస్త్రచికిత్స వల్ల ఇంతకాలం విశ్రాంతి తీసుకున్న ప్రభాస్ ఇటీవలే కోలుకున్నాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా సెట్స్ లోకి ఇవాళ అడుగుపెట్టాడు. ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ న్యూ లుక్ లో కనిపించాడు. రెబల్ స్టార్ న్యూ లుక్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక ఈ హీరో న్యూ లుక్ చూసి సర్ ప్రైజ్ అయ్యారు. ఈ వీడియోలో ప్రభాస్ క్యాజువల్ వేర్ లో కనిపించాడు. వైట్ కలర్ టీ షర్ట్ లో తలపై స్టైలిష్ హ్యాట్ పెట్టుకుని, కళ్లకు గాగుల్స్ తో అల్ట్రా పాష్ గా కనిపించాడు. ఓ వైపు క్యాజువల్ గా కనిపిస్తూ మరోవైపు మోస్ట్ స్టైలిష్ గా కనిపించాడు ప్రభాస్. ఇందులో ఈ హీరో హెయిర్ స్టైల్, గడ్డం కూడా కాస్త మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. వింటేజ్ ప్రభాస్ తిరిగొచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లా కనిపించనున్నట్లు మూవీ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రభాస్తో పాటు ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ను లవర్ బాయ్ గా, వింటేజ్ లుక్ లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు. కానీ తాజా వీడియో చూసి మళ్లీ తమ స్టైలిష్ హీరో వచ్చేస్తున్నాడంటూ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
#TheRajaSaab Look 👑 Just Now I got confirmation that it's from latest schedule of the movie "THE RAJA SAAB"@DirectorMaruthi 👏 efforts to satisfy our fans and we are going to witness the energetic RebelStar PRABHAS.@SKNonline @peoplemediafcy #Prabhaspic.twitter.com/ojzVmRzjan
— Prabhas Fan (@ivdsai) April 18, 2024