Nabha Natesh Priya darshi fight మరోసారి నెట్టింట నభా-ప్రియదర్శి లొల్లి.. ఈవెంట్ నుంచి కోపంతో వెళ్లిపోయిన హీరోయిన్

- Advertisement -

Nabha Natesh Priya darshi fight గత రెండు మూడ్రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ నభా నటేశ్ – నటుడు ప్రియదర్శి మధ్య చిన్న వార్ నడుస్తోంది. ఇటీవలే నభాను డార్లింగ్ అని ప్రియదర్శి పిలవడంతో ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆ గొడవ ఇప్పుడు ఇంకాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. ఈ ఇద్దరు కలిసి నటించిన డార్లింగ్  అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో ఈ జంట మరోసారి గొడవ పడింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే

 నభా నటేష్ దాదాపు రెండేళ్లుగా టాలీవుడ్ తెరకు దూరంగా ఉంది. సోషల్ మీడియా, ఇతర ఈవెంట్లలో కూడా కనిపించలేదు. దాదాపుగా మాయమైనట్లే అంతా అనుకున్నారు. అయితే ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం, శస్త్ర చికిత్సలు జరగడం వల్ల ఆమె ఇన్నాళ్లూ లైమ్ లైట్ లో లేరట.  ప్రస్తుతం పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శి హీరోగా చేస్తున్న డార్లింగ్ సినిమాలో నటిస్తున్నారు నభా.

- Advertisement -

తాజాగా టైటిల్ ప్రోమో రిలీజ్ ఈవెంట్​లోనూ వీరు స్టేజిపై గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియదర్శి నభాతో మాట్లాడుతూ “ఈ రెండేళ్లలో నేను ఐదు సినిమాలు చేశాను. నువ్వు ఒక సినిమా కాదు కదా, సినిమా ఈవెంట్​లోనూ కూడా కనిపించలేదు” అంటూ మాట్లాడారు.

దర్శి మాటలకు నభా హర్ట్ అయినట్లు కనిపించింది.  సినిమా ప్రమోషన్స్ అని చెప్పి పర్సనల్ లైఫ్​ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ఈ రెండేళ్లలో నాకు ఏం జరిగింది, దాని నుంచి కోలుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది మీకు కూడా తెలుసు. అయినా మీరు ఇలా మాట్లాడటం సరికాదు. నేను ఇందుకోసం సైన్ చేయలేదు అంటూ ఎమోషనల్ అవుతూ స్టేజ్​ మీద నుంచి వెళ్లిపోయింది నభా.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు స్క్రిప్ట్​లో భాగంగానే ఇలా చేశారోమో అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో వీరు నిత్యం గొడవపడే భార్యాభర్తలుగా కనిపించనున్నారట. అందుకే ప్రమోషన్స్​ను కూడా ఈ మూవీ థీమ్​కు తగ్గట్టుగానే నుంచి చేస్తున్నారు.

 ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హనుమాన్​ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చెందిన నిరంజన్ రెడ్డి దీనికి ప్రొడ్యూసర్​. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రంలో అనన్య నాగళ్ళ, శివ రెడ్డి, మురళీధర్ గౌడ్, కృష్ణ తేజ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here