Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ పని చేస్తే సలార్ బైక్ మీ సొంతం

- Advertisement -

Prabhas : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్‌ ఇండియన్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ చివరిగా నటించిన సలార్ మూవీ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లను సాధించి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. గ‌తేడాది చివ‌రిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో, డిజిటల్ మీడియాలోనూ రికార్డులు బద్ధలు కొట్టింది. అయితే త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ మా లో ఈనెల 21న సలార్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లోనూ, డిజిటల్ మీడియాలోను భారీ సక్సెస్ అందుకున్న సలార్ బుల్లితెరపై కూడా అంతకుమించిన హిట్ అందుకోవాలన్న ఉద్దేశంతో మేకర్స్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వారు చేయాల్సిందల్లా కేవలం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే. అందుకు గాను సినిమాలో ప్రభాస్ నడిపిన ఐకానిక్ బైక్ ను గెలుచుకునే అవకాశం పొందొచ్చంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

- Advertisement -

ఈ ఆదివారం స్టార్ మా లో స్ట్రీమింగ్ కానున్న సలార్ సినిమా చూస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెబితే.. ఆ బైక్ గెలిచే అవకాశం మీ సొంతం అంటూనే.. చివరిలో టర్మ్స్‌ అండ్ కండిషన్స్ అప్లై అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును షేర్ చేశారు. అయితే ఈ ప్రభావం సినిమా టీఆర్పీ రేటింగ్ పై భారీ ప్రభావం చూప‌నుంది. ఇలా మొదటి భాగంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సలార్‌.. రెండో భాగంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here