Poonakaalu : ‘ పునకాలు ‘ సాంగ్ అదిరిపోయింది..థియెటర్లలో రచ్చ రచ్చే ఇక..

- Advertisement -

Poonakaalu : మెగాస్టార్ చిరంజీవి,మాస్ రాజా రవి తేజ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’..చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది..ఇందులో చిరు లుక్స్ నుంచి స్టోరీ వరకూ అన్ని కూడా సినిమాలో జనాలకు నచ్చేలా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండటం తో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Poonakaalu
Poonakaalu

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య నుంచి పూనకాలు లోడింగ్ అంటూ మరో పాటను రిలీజ్ చేశారు. ఇద్దరు మాస్ హీరోల మధ్య పోటీ.. మెగా ఫ్యాన్స్ కు నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది ఈ పాట. ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల ముందుగానే న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందించేశారు.అనౌన్స్ మెంట్ పోస్టరే పూనకాలు తెప్పించేసింది.

Chiranjeevi
Chiranjeevi

ఆ పాటలో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్ గా చూస్తూ కనిపించారు. బ్యాక్గ్రౌండ్ లో జాతర వాతావరణం కనిపిస్తోంది. పోస్టర్ లో చిరంజీవి, రవితేజ కాంట్రాస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరు టైటిల్ రోల్ లో కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో కనిపిస్తూ అదరగొట్టింది.. నాలుగో పాట ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కాబోతోంది…కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా మూవిని విడుదల చేయనున్నారు.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here