Pooja Hegde : బాయ్ ఫ్రెండ్ తో ముంబయి వీధుల్లో బుట్టబొమ్మ.. పెళ్లి న్యూస్ ఎప్పుడు చెబుతుందో మరి?

- Advertisement -

Pooja Hegde : మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే దాదాపుగా రెండేళ్ల నుంచి తెలుగులో సినిమాలు తీయడం లేదు. టాలీవుడ్ లో ఈ భామ చివరి చిత్రం రాధేశ్యామ్. ఆ సినిమా ఫ్లాప్ కావడం.. ఆ తర్వాత ఇతర భాషల్లో తీసిని చిత్రాలు కూడా ఒక్కొక్కటిగా ఫెయిల్ కావడంతో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పిలుచుకున్న ఈ భామ ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఇక ఆ తర్వాత మహేశ్ బాబు గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చింది. కానీ ఏమైందో ఏమో ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకుంది.

అంతే ఇక అప్పటి నుంచి టాలీవుడ్ లో పూజ ఊసే వినిపించడం లేదు. కానీ ముంబయిలో మాత్రం అప్పుడప్పుడు కెమెరా కంటికి చిక్కుతూ తానింక మాయమైపోలేదని నిరూపిస్తోంది. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు సందడి చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. అయితే పూజ ఇటీవల ముంబయిలో తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించిందని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చంతా పూజ ప్రేమాయణం గురించే. ఈ భామ హిందీ సీరియల్ నటుడు, బిగ్ బాస్ సీజన్ -10 ఫేమ్ రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉందని టాక్. గత కొంతకాలంగా ఈ జంట కలిసే ఈవెంట్స్ కు హాజరవుతుండటం, పూజ ఫ్యామిలీతో కలిసి రోహన్ డిన్నర్ డేట్స్ కు వెళ్లడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గామారింది. ఈ క్రమంలోనే వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు నెట్టింట చర్చ మొదలైంది.

తాజాగా పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ కూడా రోహన్‌ మెహ్ర కనిపించాడు. పూజా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీంతో ఈ భామ అతనితో డేటింగ్‌లో ఉన్నట్లు మీడియా కన్ఫామ్ చేసేసింది. ఈ జంట లవ్ స్టోరీకి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందుకే పూజ ఫ్యామిలీతో రోహన్ క్లోజ్ గా ఉంటున్నాడని సన్నిహితులు అంటున్నారట. అయితే ఈ జంట ఈ రూమర్స్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక పూజ ప్రస్తుతం బాలీవుడ్ లో దేవా అనే చిత్రంలో నటిస్తోంది. అంతకుముందు ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ తో నటించిన కిసీ కీ జాన్ కిసీ కా బాయ్ అనే చిత్రంలో నటించి మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here