Kurchi Madatha Petti Song : 200M ప్లస్ వ్యూస్ మడతబెట్టేసిందిగా.. యూట్యూబ్ లో మహేశ్ బాబు సాంగ్ ర్యాంపేజ్

- Advertisement -

Kurchi Madatha Petti Song : ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమా గుంటూరు కారం. ఫస్ట్ రెండు మూడు రోజులు నెగిటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్లతో దూసుకెళ్లింది. ఈ మూవీలో మహేశ్ బాబు యాస, వేషంతో పాటు పాటలు, బీజీఎం ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల కాంబినేషన్​లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా తాజాగా మరో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో కుర్చి మడతపెట్టి సాంగ్​ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. విదేశాల ఇన్ ఫ్లుయెన్సర్లతో పాటు పలువురు క్రీడాకారులు కూడా ఈ పాటపై రీల్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈవెంట్స్​, బర్త్​డే ఫంక్షన్స్, పార్టీ ఏదైనా ఈ పాటే వినిపిస్తోంది. రిలీజైన కొన్ని నెలల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది.

- Advertisement -

తాజాగా ఈ సాంగ్​ మరో మైల్​స్టోన్​ను దాటింది. యూట్యూబ్​లో ఇప్పుడు దాదాపు 200 మిలియన్ పైగా వ్యూస్​ను అందుకుంది. ఇది చూసిన మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అట్లుంటది మా మహేశ్ బాబుతో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏడాదిలోగా ఇంకా ఎన్నో రికార్డులు సాధిస్తుందని అంటున్నారు. గతంలోనూ ఈ సాంగ్ పలు రికార్డులు మూట గట్టుకున్న విషయం తెలిసిందే. అమెరికా హూస్టన్ లో జరిగిన నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్​లో ఈ పాటకు అక్కడి వారు స్టెప్పులేసి స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక ఆఫ్రికాలోనూ ఈ పాటకు రీల్స్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here