Pawan – Trivikram : ఓటిటిలో ఆహా లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న టాక్ షో అన్ స్టాపబుల్ గురించి అందరికి తెలుసు.. బాలయ్య వ్యాక్యాతగా ఈ షో జనాల్లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఎందరో, సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారు.ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ జనాలను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.. ఆ రికార్డులను పవన్ ఎపిసోడ్ బ్రేక్ చేసింది.పవన్ కళ్యాణ్ ఆహా ‘అన్ స్టాపబుల్’ పార్ట్ వన్ ఎపిసోడ్ తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ షోలో బాలయ్య, పవన్ లు ఫుల్ జోష్ మీద కనిపించారు..
ఫస్ట్ టైం ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో దాదాపు గంటన్నరకు పైగా కొత్త విషయాలు గురించి మాట్లాడుకోవడం తో మెగా మరియు నందమూరి అభిమానులు ఈ షో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హోస్ట్ గా బాలకృష్ణ మరింతగా పవన్ కళ్యాణ్ ని నవ్వించారు. ఇదే సమయంలో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు ఇంకా వ్యక్తిగత విషయాలు గురించి కూడా ప్రశ్నలు వేయడం జరిగింది.. అవి నెట్టింట ఎలా చక్కర్లు కొడుతున్నాయో తెలిసిందే.. అందులో భాగంగా త్రివిక్రమ్ గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు అడిగారు .త్రివిక్రమ్ మీరు బాగా ఫ్రెండ్స్ అంటగా అని బాలయ్య ప్రశ్నించగా అవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు స్నేహితుడిగా కంటే త్రివిక్రమ్ తన గురువుగా భావిస్తానని పవన్ చెప్పడంతో బాలయ్య ఆశ్చర్యపోయారు.
ఓ రచయితని గురువుగా భావించావంటే నీ మీద ఉన్న గౌరవం నాకు ఇంకా మరింతగా పెరిగింది అని ప్రశంసించారు. ఇక ఇదే సమయంలో త్రివిక్రమ్ తాను ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు.. ఆ గొడవ ఇప్పటికి జరుగుతూ వస్తుంది.
అతడు సినిమా స్క్రిప్ట్ చెబుతున్న సమయంలో తాను నిదరపోయినట్లు.. త్రివిక్రమ్ చెబుతాడు. కానీ తాను నిద్రపోలేదు సినిమా స్క్రిప్ట్ మొత్తం విన్నాను అని.. చెబుతాను. లేదు లేదు నువ్వు నిద్రపోయావు అని త్రివిక్రమ్ నాతో ఇప్పటికీ కూడా గొడవ పడుతూ ఉంటాడు.. ఇలా ఇద్దరికీ ఉన్న బంధం గురించి పవన్ కళ్యాణ్ చెప్పారు.. అది కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి కోట్ల రూపాయలు వచ్చాయంటూ మీడియా సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.