Sreeleela : ధ‌మాకా బ్యూటీ ‘శ్రీ లీల’ చిన్ననాటి ఫోటోలు.. తెగ ముద్దొస్తుందిగా..

- Advertisement -

Sreeleela : ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ శ్రీలీల..పెళ్లి సందడి అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హాట్ కన్నడ బ్యూటీ కి కేవలం రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజి వచ్చేసింది. ఇప్పుడు కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు శ్రీ లీల ని తమ సినిమాల్లో తీసుకోవడానికి క్యూ కట్టేస్తున్నారు.

Sreeleela
Sreeleela

ఇప్పటికే అరడజను సినిమాలకు కమిట్ అయిన శ్రీ లీల రాబొయ్యే రెండు మూడేళ్ళలో పాన్ ఇండియా లెవెల్ లో ఇండస్ట్రీ ని ఏలేస్తున్న పూజా హెగ్డే మరియు రష్మిక వంటి వాళ్ళని దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు, ఇక ఈ అమ్మాయి ఇంస్టాగ్రామ్ రీల్స్ చెయ్యడం లో తెగ నేర్పరి, ఇది వరకు ఆమె ఎన్నో రీల్స్ చేసింది, అంతే కాకుండా తనకి సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది శ్రీ లీల.

Sreeleela Child Photos

ఇక శ్రీ లీల కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఆమెకి సంబంధించి ఎదో ఒక విషయం తెలుసుకోవాలని పరితపిస్తూనే ఉంటారు ఫ్యాన్స్. అలా గూగుల్ లో ఆమె గురించి వెతకగా, ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియా లో దొరికాయి, అవి ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయాయి..చిన్నతనం లోనే ఆమె అప్పటి కన్నడ స్టార్ హీరోలతో కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

- Advertisement -
Sreeleela Child Stills

ఇదంతా చూసి ఆమె తల్లి కానీ తండ్రి కానీ సినీ బ్యాక్ గ్రౌండ్ కి చెందిన వారు అయ్యి ఉంటారా వంటి సందేహాలు అభిమానుల్లో రావడం సహజం, కానీ వాస్తవానికి శ్రీ లీల అమ్మ గారు బెంగళూరు లో ఒక పాపులర్ డాక్టర్, సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన స్టార్ హీరోలకు కానీ, హీరోయిన్స్ కి కానీ మిగిలిన ఏ ఆర్టిస్టుకి అయినా కానీ ఆరోగ్య సమస్య వస్తే శ్రీ లీల అమ్మ స్వర్ణలత దగ్గరకే వస్తారు. KGF హీరో యాష్ సతీమణి కి కూడా డెలివరీ చేసింది ఈమెనే.

ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు మీరు చూడని శ్రీ లీల చిన్ననాటి ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి:

Actress Sreeleela Pics
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here