Unstoppable with NBK : పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి అన్ని కోట్లు రాబోతున్నాయా?



Unstoppable with NBK : ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోలతో బాలయ్య బాబు చేసే చిట్ చాట్ కి ప్రేక్షకుల నుండి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది..మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో..రెండవ సీజన్ అంతకు మించి సూపర్ హిట్ అయ్యింది..ఈ రెండవ సీజన్ రేపు రాత్రి ప్రసారం అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ముగియబోతుంది.

Unstoppable with NBK
Unstoppable with NBK

ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలను విడుదల చేసారు..వాటికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక రేపు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వడం ద్వారా ఇప్పటి వరకు ఇండియన్ ఓటీటీ చరిత్రలో ఏ టాక్ షో కి రాని వ్యూస్ ఈ ఎపిసోడ్ సొంతం చేసుకోబోతుందని ఆహా టీం ఆశిస్తుంది.

Pawan Kalyan Unstoppable with NBK

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అప్లోడ్ చేసిన గంటలోనే 20 లక్షలకు పైగా వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారట..ఆహా లో మెంబెర్ అవ్వాలంటే కనీసం 199 రూపాయిలు ఉండాలి.. అప్పటికే చాలా మంది యూజర్లు అందులో ఉండొచ్చు, అంతే కాకుండా కొత్త యూజర్లు కూడా రావొచ్చు.. అవన్నీ కలుపుకొని కేవలం ఒక్క గంటలోనే 15 కోట్ల రూపాయిల రెవిన్యూ వస్తుందని అంచనా వేస్తున్నారు..గతం లో ప్రభాస్ ఎపిసోడ్ అప్లోడ్ చేసినప్పుడు లక్షల మంది ఒకేసారి ఆహా యాప్ ని ఓపెన్ చెయ్యడం వల్ల, సర్వర్ క్రాష్ అయ్యింది.

Unstoppable with NBK On aha

ఈసారి అలాంటి సంఘటనలు ఎదురు కాకుండా ఉండేందుకు ఆహా మీడియా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది.. యాప్ క్రాష్ అవ్వకుండా ఉండేందుకు సర్వర్ బ్యాండ్ విడ్త్ బాగా పెంచడం తో పాటుగా, మరో మూడు బ్యాకప్ సర్వర్లను కూడా సిద్ధం గా ఉంచుకున్నారట.. వీటి కోసం ఒక ప్రత్యేక బృందం పనిచేస్తున్నట్టు ఆహా మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు ప్రెస్ మీట్ లో తెలిపాడు.

Unstoppable with NBK pawan kalyan