Pawan Kalyan : పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ పాడిన పాటలేంటో తెలుసా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ Pawan Kalyan .. సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా ఈ స్టార్​కున్న క్రేజే వేరు. పవన్​తో సినిమా అంటే నిర్మాతలు ముందుంటారు. ఎందుకంటే మూవీ ఎలా ఉన్నా బాక్సాఫీస్ హిట్ ఖాయం.. పెట్టిన పెట్టుబడి రావడం పక్కా. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. థియేటర్​లో మాత్రమే సినిమా చూస్తారు. అది కూడా కంటెంట్, లాజిక్ ఇవేం చూడరు. జస్ట్ పవన్ కల్యాణ్​ను మాత్రమే చూస్తారు. పవన్​ Pawan Kalyan కోసం మాత్రమే థియేటర్​కు వస్తారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఫ్యాన్స్​ కోసం కూడా ఈ పవర్​స్టార్ అంతే ఆరాటపడతాడు. వారిపై అంతకు మించి అభిమానం చూపిస్తాడు. అందుకే పవన్ కల్యాణ్​కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు ఉంటారని అంటారు. పవన్​లో కేవలం యాక్టింగ్​ స్కిల్స్​ మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, ఓ సూపర్ సింగర్ కూడా ఉన్నాడు. పవర్​స్టార్ చాలా సార్లు తనలోని సింగర్​ను బయటపెట్టాడు. తన సినిమాల్లో ఇప్పటి వరకు అరడజనుకుపైగా పాటలు కూడా పాడాడు. ఒక్కో పాట సూపర్ హిట్. మరి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ పాడిన పాటలెన్నో ఓసారి చూసేద్దామా..?

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ‘ఖుషీ’ ఒకటి. ఆ సినిమాలోనూ పవన్‌ ఓ పాట పాడాడు. ఏంటీ.. గుర్తొచ్చేసిందా? ఆఁ.. మీరనుకున్నపాటే… ‘బై బయ్యే బంగారు రమణమ్మ..’. అలీ వచ్చి.. మీ నాన్న పాట.. సీకాకుళం పాట అనగానే పవన్‌ అందుకుంటాడు. గుడుంబా మత్తులో పవన్‌ వేసే సరదా స్టెప్పులు, ఆ తర్వాత మధుమిత అలియాస్‌ భూమిక పోస్టర్‌ దగ్గర చేసే రచ్చ వేరే లెవల్‌. ఆ సీన్‌ అంతగా హైలోకి వెళ్లిందంటే ఈ పాటదీ ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు.

- Advertisement -

పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే… అతడి ఫిలాసఫీ, ఆలోచన విధానం గురించి ఎక్కడో ఓ చోట కచ్చితంగా చెబుతాడు అంటుంటారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రయత్నాలు చేశాడు పవన్‌. దర్శకుడిగా మారి ‘జానీ’ చేశాడు. అందులో ఒక బిట్‌ సాంగ్‌, ఒక ఫుల్‌ సాంగ్‌ ఆలపించాడు. ఎమ్మెస్‌ నారాయణ తాగుడు గురించి పవన్‌ సెటైరికల్‌గా పాడే పాట ‘నువ్వు సారా తాగకు..’ పాటకు ఆ రోజుల్లో సూపర్‌ రియాక్షన్‌ వచ్చింది. అదే సినిమాలో సమాజంలోని కొంతమంది మోసగాళ్ల మీద సెటైర్లతో పాడిన పాట ‘రావోయి మా ఇంటికి…’ పాట కూడా బాగుంటుంది.

బిట్‌ సాంగ్స్‌, సందేశం ఇచ్చే సాంగ్సేనా పవన్‌ పాడింది అంటే… కాదనే చెప్పాలి. ఎందుకంటే ‘గుడుంబా శంకర్‌’లో పవన్‌ ఓ ఐటమ్‌ సాంగ్‌ పాడాడు. ‘కిల్లీ కిల్లీ..’ అంటూ పవన్‌ గొంతెత్తితే ఫ్యాన్స్‌ ఊగిపోయారంతే. పవన్‌ గొంతు, స్టెప్పులు కలసి పాట ఫుల్‌ జోష్‌లో ఉంటుంది.వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ వచ్చిన పవన్‌.. ‘గుడుంబా శంకర్‌’ తర్వాత చాలా సినిమాల్లో పాడలేదు.

మళ్లీ ‘పంజా’తో గొంతు సవరించుకున్నాడు. ఈసారి ‘పాపా రాయుడు…’ అంటూ బ్రహ్మానందాన్ని పవన్‌ పొగుడుతూ తిట్టే పాట అది. ఫుల్‌మాస్‌ బీట్‌లో సాగే ఈ పాట చాలా రోజులు రిపీట్‌ మోడ్‌లో వినేసి సంతోషించారు అభిమానులు.

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన.. ‘అత్తారింటికి దారేది’లోనూ పవన్‌ గానం వినిపిస్తుంది. ‘కాటమ రాయుడా కదిరి నరసింహుడా…’ అంటూ పవన్‌ మళ్లీ బద్దం భాస్కర్‌ అలియాస్‌ బ్రహ్మానందం భరతం పట్టేలా ఆ పాటను రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌, పవన్‌ గొంతు పాటకు ఓ డిఫరెంట్‌ స్టైల్‌ని ఇచ్చాయి.

సహచర నటుణ్ని ఆటపట్టించే పాటలు పాడటం అంటే.. పవన్‌ కల్యాణ్‌కు కొట్టినపిండి. ఆయన పాడిన పాటలు చాలావరకు అలానే ఉంటాయి. ఇదే కోవలో ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్‌ ఓ పాట పాడాడు. రఘుబాబును ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ పవన్‌ గొంతెత్తితే.. యూట్యూబ్‌లో వ్యూస్‌ రికార్డులు మారిపోయాయి. ఇక థియేటర్లలో ఫ్యాన్స్‌ జోష్‌ అయితే అదిరిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here