Unstoppable With NBK : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ని తల్చుకొని ఏడ్చేసిన పవన్ కళ్యాణ్

saidharam tej in unstoppable with nbk


Unstoppable With NBK : కోట్లాది మంది అభిమానులతో పాటుగా ఇతర హీరోల అభిమానులు మరియు రాజకీయ నాయకులు ఇలా అందరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న ఆహా మీడియా లో స్ట్రీమింగ్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.. ఒక కొత్త సినిమా విడుదలైతే ఎంత హైప్ ఉంటుందో.. ఈ ఎపిసోడ్ విడుదల అవుతున్నప్పుడు కూడా అదే రేంజ్ హైప్ ఏర్పడింది..సోషల్ మీడియా మొత్తం పవన్నామస్మరణ తో మారుమోగిపోయింది.

భారీ హైప్ కి తగ్గట్టుగానే రెస్పాన్స్ అదిరిపోయింది..పవన్ కళ్యాణ్ జీవితం లో ఎవరికీ తెలియని కొన్ని కోణాలు ఈ ఎపిసోడ్ ద్వారా బయటపడింది..ఈ ఎపిసోడ్ మధ్యలో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వచ్చి కాసేపు సందడి చేస్తాడు..ఇది ఎపిసోడ్ లో ప్రముఖంగా వినిపించే హైలైట్స్ లో ప్రధానమైనది..అయితే సాయి ధరమ్ తేజ్ వచ్చే ముందు బాలయ్య అడిగిన ఒక ప్రశ్న కి సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు.

Unstoppable With NBK
Unstoppable With NBK

బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు చాలా మానసిక క్షోభకి గురి అయ్యావని నేను విన్నాను.. ఆరోజు ఈ వార్త విన్న తర్వాత నీ స్థితి ఎలా ఏమిటి’ అని అంటాడు. .అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్తూ ‘ఈ సంఘటన జరిగినప్పుడు నేను అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చి ఉన్నాను..

త్రివిక్రమ్ గారు నాకు కాల్ చేస్తే కలవకపొయ్యేసరికి, మా ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తి వల్ల ఈ విషయం నాకు తెలిసింది.. వెంటనే నేను త్రివిక్రమ్ కలిసి హాస్పిటల్ కి వెళ్ళాము.. అక్కడ వాడు అపస్మారక స్థితి లో ఉండడం చూసి చాలా బాధపడ్డాను.. కోలుకుంటాడు అనే విశ్వాసం ఉన్నింది.. కానీ మూడు నాలుగు రోజులు గడిచిన తర్వాత కూడా పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పడం తో చాలా కంగారు పడ్డాను.. దాదాపుగా చావు దాకా వెళ్లి బయటకి వచ్చాడు’ అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు పవన్ కళ్యాణ్.