Unstoppable With NBK : ‘బాలయ్య ఉన్నాడు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్న’..3 పెళ్లిళ్ల పై పవన్ షాకింగ్ సమాధానం

pawan kalyan about three marriages


Unstoppable With NBK : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ ఈరోజు ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించింది..అన్ని ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ చాలా స్వచ్ఛంగా అనిపించింది..ఎక్కడా కూడా ఆర్టిఫిషల్ గా లేకుండా చాలా నిజాయితీగా సమాదానాలు చెప్పాడు పవన్ కళ్యాణ్..బాలయ్య తో ఎపిసోడ్ అంటే సరదాగా సాగిపోతాది..కానీ ఈ ఎపిసోడ్ మాత్రం చాలా గౌరవప్రదంగా సాగిపోయింది.

పవన్ కళ్యాణ్ కి ఉన్న జ్ఞానం చూసి బాలయ్య సైతం ఆశ్చర్యపోయాడు..అతనిని విధేయత చూసి గౌరవం ని పదింతలు ఎక్కువ పెంచుకున్నాడు బాలయ్య..అయితే కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ నుండి కొన్ని సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు..అందులో మూడు పెళ్లిళ్లు ఒకటి..ఎంతో నిజాయితీగా నిక్కచ్చి గా ఉండే పవన్ కళ్యాణ్ ఎందుకు మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఎప్పటి నుండో అభిమానులను ప్రేక్షకులను తొలిచేస్తున్న ప్రశ్న.

Pawan Kalyan At Unstoppable With NBK
Pawan Kalyan At Unstoppable With NBK

దీని గురించి బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడుగుతూ ‘అసలు ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా’ అని అంటాడు.. అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి ముందుగా చిరునవ్వుతో సమాధానం చెప్తూ ‘చాలా మంది నన్ను ఇది అడుగుతూ ఉంటారు.. కానీ ఇది కాకుండా వేరే దగ్గర అయ్యుంటే, నా సమాధానం వేరేలా ఉండేది.. కానీ బాలయ్య బాబు గారి లాంటి పెద్దలు ఉన్న షో కాబట్టి, నా పై విమర్శలు చేసే వాళ్లకు చాలా కూల్ గా సమాధానం చెప్తున్నాను..

నేనేమి ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు.. ఒకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో నాకు అభిప్రాయాలూ సెట్ అవ్వక.. ఆ తర్వాత కొన్నేళ్ళకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. నేను ఏమి వ్యామోహం తో మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. అలా జరిగిపోయింది అంతే.. ప్రతీ కుటుంబం ఉండే గొడవలే ఇవి’ అని అంటాడు..

pawan kalyan unstoppable with nbk

అప్పుడు బాలయ్య దానికి సమాధానం చెప్తూ ‘రాజకీయ జీవితం లో ఉన్నప్పుడు ఎదో ఒక విమర్శ చెయ్యాలి..పవన్ కళ్యాణ్ మీద ఏమి చేస్తాము..? ఎదో ఒకటి చెయ్యాలి కాబట్టి పెళ్లిళ్ల మీద చేస్తారు..ఈ సందర్భంగా నేను అందరికీ ఒక్కటే చెప్తున్నాను..పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంకా విమర్శలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పిచ్చి కుక్కలతో సమానం’ అని బాలయ్య సమాధానం చెప్తాడు.