Pawan Kalyan : తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ స్టంట్స్ నిజం కాదా? వైరల్ అవుతున్న పవన్ కామెంట్స్

- Advertisement -

Pawan Kalyan : ఆహా మీడియా లో ప్రసారం అయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ 2 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.. పవన్ కళ్యాణ్ తో తీసిన ఎపిసోడ్ ని ఆహా మీడియా ఆఖరి ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించారు.. మొదటి భాగం ఈరోజు రాత్రి 9 గంటలకు విడుదల అవ్వబోతుండగా.. రెండవ భాగం ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి రెండు ప్రోమోలను విడుదల చేసారు..వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు మరొక్క చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేశారు..అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.

Pawan Kalyan
Pawan Kalyan

ఈ గ్లిమ్స్ లో బాలయ్య బాబు ముందుగా మాట్లాడుతూ ‘తమ్ముడు సినిమాలో నువ్వు చేసిన స్టంట్స్ అన్ని రియల్ కాదు అంటగా నిజమేనా’ అని అడుగుతాడు బాలయ్య.. అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి నవ్వుతూ ‘ఈ సినిమాలో నేను ఒక స్తంభాన్ని నేను కొట్టాల్సి ఉంటుంది.. అది నిజం స్తంభం అని తెలియక బాగా కొట్టేసాను.. చేతి నుండి రక్తం బాగా కారిపోయింది.. అప్పుడు డైరెక్టర్ ఎవర్రా ఇక్కడ.. ఇటు రండి అని కోపం తో అరిచాను’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Aha

ఆయన పూర్తిగా ఏమి చెప్పాడో తెలియాలంటే ఈరోజు రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.. ఈ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని.. భారత దేశ ఓటీటీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేంజ్ రికార్డ్స్ నెలకొంటాయని మేము ఆశిస్తున్నాము.. 9 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభిస్తే ఒక్క గంటలోనే 2 మిలియన్ వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాము.. అంత ట్రాఫిక్ వస్తే మా సర్వర్ బ్యాండ్ విడ్త్ సరిపోదు కనుక కెపాసిటీ బాగా పెంచాము..

- Advertisement -

బ్యాకప్ లో మూడు సర్వర్లను కూడా సిద్ధంగా ఉంచాము.. అన్ స్టాపబుల్ విత్ NBK ఎపిసోడ్ అప్లోడ్ చేసే సమయం లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మూడు టెక్నికల్ టీమ్స్ కూడా సిద్ధం చేసి ఉంచాము అంటూ ఆహా మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ సందర్భంగా తెలిపాడు.

unstoppable with nbk
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here