Nithiin : పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని కాజేసిన నితిన్.. అభిమానుల సెగ తట్టుకోగలడా..?

- Advertisement -

Nithiin : పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు,ఆయన సినిమా టైటిల్స్ కి కూడా మార్కెట్ లో మామూలు క్రేజ్ లేదని యువ హీరోలు నిరూపిస్తూ ఉన్నారు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ ‘ఖుషి’ టైటిల్ ని తన కొత్త సినిమాకి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి ఇప్పుడు మామూలు రేంజ్ క్రేజ్ లేదు.టీజర్,ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెంచేసాయి.

Nithiin
Nithiin

సెప్టెంబర్ 1 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక లేటెస్ట్ గా మరో యంగ్ హీరో , పవన్ కళ్యాణ్ వీరాభిమాని ‘నితిన్’ కూడా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ని కాజేసాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తమ్ముడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాతే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మేనియా మొదలైంది.

ఆయన కెరీర్ లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా టైటిల్ ని ‘నితిన్’ తన కొత్త సినిమాకి పెట్టుకున్నాడు. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ తో నితిన్ లేటెస్ట్ చిత్రం నేడే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ మరియు హీరో నితిన్, వీళ్లంతా కూడా పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానులో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

- Advertisement -

అలా ఆయన అభిమానులు మొత్తం కలిసి, కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన తమ్ముడు చిత్రం టైటిల్ ని పెట్టుకోవడం పై కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు, కానీ కొంతమంది అభిమానులు మాత్రం అంత పెద్ద హిట్ సినిమా టైటిల్ ని వాడడం అవసరమా అంటూ నితిన్ ని ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ‘తమ్ముడు’ చిత్రం పాత ‘తమ్ముడు’ సినిమాలాగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here