Sir Movie : ఈమధ్య కాలం లో తమిళ హీరోలకు మన తెలుగు సినిమా మార్కెట్ పై కన్ను పడింది.ఈమధ్యన తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు తో కలిసి ‘వారసుడు’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఇక్కడ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో చేసిన డైరెక్ట్ చిత్రం ‘సార్’ కూడా ఈ నెల 17 వ తారీఖున విడుదల కాబోతుంది.

‘భీమ్లా నాయక్’ , ‘DJ టిల్లు’ వంటి సూపర్ హిట్స్ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్ కి తెలుగు లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తగలబోతుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త గత కొద్దీ రోజుల నుండి జోరుగా ప్రచారం సాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నారని, ఇటీవలే ఈ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించగా ఆయన కచ్చితంగా వస్తానని మాట ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.ధనుష్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే.

అనేక ఇంటర్వ్యూస్ లో ఆయన ఈ విషయాన్నీ తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియా లో కూడా ఒక సందర్భం లో ఆయన ఈ విషయాన్నీ బహిరంగంగానే తెలిపాడు. నేషనల్ అవార్డు ని గెలుచుకున్న ధనుష్ లాంటి స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అవ్వడాన్ని పవన్ ఫ్యాన్స్ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరి వీళ్ళిద్దరిని ఒకే వేదికపై చూస్తే ఫ్యాన్స్ కి కనుల పండుగే అని చెప్పొచ్చు.