Balakrishna : బాలయ్య పెళ్ళికొడుకాయెనే.. ఫస్ట్ టైమ్ అందుకోసం ఇలా.!?

- Advertisement -

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. అన్ స్టాపబుల్ షో తో మొదటిసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో సంచలనాన్ని సృష్టించాడు బాలయ్య.. ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు బాలకృష్ణ. తాజాగా ఓ కమర్షియల్ యాడ్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది..

balakrishna pragya jaiswal
balakrishna pragya jaiswal

ఈ యాడ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు సమాచారం. బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరోసారి వీళ్లిద్దరూ కలిసి ఓ కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నట్లు సమాచారం.. అందుకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ ఫోటోలో బాలకృష్ణ పెళ్ళికొడుకుగా తెల్ల పంచ కట్టు పైజామాతో కనిపిస్తే..

ప్రగ్యా జైస్వాల్ ఆకుపచ్చ చీరలో పూసల హారం వేసుకొని సిగ్గుపడుతూ కనిపించింది.. ఇక వారిద్దరు చుట్టూ బంధుమిత్రుల సమక్షంలో బాలయ్య ఆనందంగా ఫోటోకి ఫోజులు ఇచ్చారు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బాలయ్య ఫస్ట్ టైం ఓ కమర్షియల్ యాడ్ కోసం పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించని ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Balakrishna Ad
Balakrishna Ad

అయితే ఈ కమర్షియల్ యాడ్ ఇందుకు సంబంధించింనది అనేది మాత్రం ప్రస్తుతానికి వివరాలు తెలియలేదు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. బాలయ్య అభిమానులు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు. బాలయ్య స్మార్ట్ లుక్ లో క్యూట్ స్మైల్ తో పెళ్లి కొడుకుగా కనిపించేసరికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అలాగే శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించనున్నారని సమాచారం. ఇప్పుడు బాలయ్య 109 సినిమా గురించి ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ముగ్గురు దర్శకులు పోటీ పడుతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here