Shakuntalam నుంచి మరో పాట రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్.. వీడియో..

- Advertisement -

Shakuntalam : తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న సినిమా శాకుంతలం..ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో అందమైన పాటను రిలీజ్ చేశారు.. ఆ పాట విడుదలైన కొద్ది నిమిషాలకే ట్రెండ్ అవుతుంది..

shakuntalam
shakuntalam

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా ఏలేలో.. ఏలేలో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్..

ఏలేలో ఏలేలో ఏలో యాలా.. ఏటిలోనా సాగే నావా.. ఏలేలో ఏలేలో ఏలో యాలా.. దూరాలేవో చేరే తోవా అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. శకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయల్దేరి వెళ్తున్న సందర్భంలో వచ్చే పాట ఇది. సందర్భానికి తగినట్లుగా ట్యూన్ లో మణిశర్మ ఈపాటను చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాటను అద్భుతంగా పాడారు.

- Advertisement -

బ్లాక్ అండ్ వైట్ వాల్ పెయింట్ మాదిరిగా ఈ పాటను అందించిన తీరు ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఈ పాటలోని లిరిక్స్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here