Bipasha Basu : కూతురికి జన్మనిచ్చిన బాలీవుడ్ బ్యూటీ

Bipasha Basu


బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీట్ పుట్టించి కుర్రకారు మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ తన కోస్టార్ కరణ్ సింగ్ గ్రోవర్‌ను 2016లో వివాహమాడింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత తన భర్త కరణ్‌తో డేంజరస్ అనే వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.

కొద్ది నెలల క్రితం తాను గర్భవతిని అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గుడ్‌ న్యూస్ చెప్పింది. అప్పటి నుంచి బిపాసా తరచూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఫొటోలు, వీడియోస్ పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కి ఎప్పుడూ అప్‌డేట్ ఇస్తూ ఉండేది. ఇవాళ బిపాసాకు బేబీ గర్ల్‌ పుట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు బిపాసా-కరణ్‌లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బిపాసా, కరణ్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టులోనే ప్రకటించారు. ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన ‘ఎలోన్‌’ సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో డేటింగ్‌ కొనసాగించారు. ఆ తర్వాత ఈ జంట సుయాష్ రాయ్, నటాషా సూరి, సోనాలి రౌత్, నితిన్ అరోరా నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘డేంజరస్’లోనూ కూడా కలిసి నటించారు.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)