షాకింగ్ న్యూస్.. సినిమాలకు వెంకీమామ గుడ్ బై చెబుతున్నారట..!

- Advertisement -

విక్టరీ వెంటేశ్ టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో ఒకరు. ఫ్యామిలీ, మాస్, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకలను ఆకట్టుకున్న హీరోల్లో వెంకీ మామ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న హీరో. కమర్షియల్,. క్లాసికల్, కల్ట్, సోషల్ ఇంపాక్ట్ ఇలా అన్ని జానర్స్ మూవీస్ లో నటించి ప్రేక్షులను అలరిస్తున్నారు. తన నటనతో చాలా మంది లేడీ ఫ్యాన్స్​ను సంపాదించుకున్నారు. తెలుగులో మీరు ఏ హీరోకైనా ఫ్యాన్ అయి ఉండొచ్చు.. కానీ టాలీవుడ్ ప్రేక్షకులంతా అభిమానించే ఏకైక హీరో వెంకటేశ్.

కలియుగ పాండవులు మూవీతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసి ఆ తర్వాత బ్రహ్మపుత్రుడు, బొబ్బిలిరాజా, ప్రేమ, స్వర్ణకమలం వంటి సినిమాలు చేసి వరుస హిట్​లు అందుకున్నారు. ఇక చంటి చిత్రంలో వెంకీమామ తనలోని మరో యాంగిల్​ని చూపించారు. ఇక వెంకీమామకు సరి జోడు సౌందర్య. టాలీవుడ్​లో వీళ్లది హిట్​పెయిర్. ఈ ఇద్దరూ కలిసి ఏడు సినిమాలు చేస్తే అందులో ఆరు బ్లాక్​ బస్టర్స్​.

- Advertisement -

ఓవైపు ఫ్యామిలీ ఆడియెన్స్​ని ఆకట్టుకుంటూనే మరోవైపు ప్రేమించుకుందాం రా, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి లవ్​ స్టోరీస్​ చేసి యూత్​కి దగ్గరయ్యారు వెంకీ. దాదాపు టాలీవుడ్ సీనియర్ హీరోలు అన్ని జానర్స్​ని టచ్ చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్​లో ఫ్యాన్స్ తమని ఎలా చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకోలేక కన్​ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్​ఫ్యూజన్​లోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద బోర్లాపడుతున్నారు.

కానీ వెంకీ మామ అలా కాదు. తన సెకండ్ ఇన్నింగ్స్​ని కామ్​గా, స్లోగా తీసుకెళ్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాకుండా అందులో ప్రేక్షకులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకునే ఆ జానర్​లో ఉన్న సినిమాలే తీస్తున్నారు. భారీ ఎత్తున ఫైట్స్, స్టన్నింగ్ ఎంట్రీ సీన్స్​, హీరోయిన్లతో ఆడిపాడటాలు ఇలాంటివి కాకుండా తన వయసుకు దగ్గరున్న పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

అలాంటి సినిమాల్లో కొన్ని దృశ్యం, దృశ్యం 2, నారప్ప. ఈ మూవీస్​ వెంకటేశ్​కు సెకండ్ ఇన్నింగ్స్​లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాయి. అంతేకాకుండా నారప్ప సినిమాలో వెంకీమామ యాక్టింగ్​కు టాలీవుడ్​ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలు ఫిదా అయ్యాయి. ఇలా వరుసగా సీరియస్ సినిమాలు తీసిన వెంకటేశ్.. తనలోని అసలైన ఆయుధం అదేనండి కామెడీ. ఈ జానర్​లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలే సీనియర్ హీరోలలో వెంకటేశ్ నంబర్ వన్. అందుకే ఎఫ్2, ఎఫ్3 సినిమాల తీసి నవ్వుతూ.. ప్రేక్షకులను నవ్విస్తూ సూపర్ హిట్ కొట్టారు.

ఇలా హ్యాపీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ మామ సడెన్​గా ఇప్పుడు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇక నుంచి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే ప్రాజెక్టులకూ ఓకే చెప్పడం లేదంట. వెంకటేశ్​కు ఆధ్యాత్మిక భావాలు కాస్త ఎక్కువే. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని కొద్దిరోజుల పాటు ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వెంకటేశ్ నటించిన ‘ఎఫ్ 3’ మూవీ ఈ ఏడాది మేలో విడుదలైంది. అప్పటి నుంచి వెంకటేశ్​ సినిమాల గురించి ఎటువంటి అప్డేట్లు లేవు. మరోవైపు, వెంకీ మామ సహచర నటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకుల మందుకు వస్తున్నారు. కాగా, బాబాయ్​ వెంకటేశ్, అబ్బాయి రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ త్వరలోనే నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here