నువ్వు నాకు హిట్ ఇచ్చేదేంటి.. హరీశ్ శంకర్‌పై ప్యాన్ ఇండియా హీరో ఫైర్

- Advertisement -

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన హరీశ్ శంకర్‌.. ఆ తర్వాత స్క్రీన్ రైటర్‌గా మారారు. అలా స్టెప్ బై స్టెప్‌గా ఎదుగుతూ షాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఇచ్చిన షాక్‌తో హరీశ్ మరో ఐదేళ్లు తేలుకోలేకపోయారు. ఆ తర్వాత తన ఫస్ట్ హీరో రవితేజ ఐదేళ్ల తర్వాత మళ్లీ హరీశ్‌కి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. అలా మాస్‌మహారాజ రవితేజతో మిరపకాయ్ మూవీ తీసి తన కెరీర్‌లో ఫస్ట్ సూపర్ హిట్‌ కొట్టాడు హరీశ్ శంకర్.

హరీశ్ శంకర్‌
హరీశ్ శంకర్‌

ఇక హరీశ్ శంకర్‌కు ఫస్ట్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హీరో పవన్ కల్యాణ్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందనే విషయం తెలిసిందే.  ఆ మూవీనే రీమేక్ చేసి పవర్‌స్టార్‌తో గబ్బర్ సింగ్ సినిమా చేశారు హరీశ్ శంకర్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా రచన, దర్శకత్వ బాధ్యతలు హరీశ్‌ శంకర్‌కు అప్పజెప్పాడు పవన్. ఎవరూ ఊహించని విధంగా, సినీ విశ్లేకులు కూడా ఆశ్యర్యపోయేలా గబ్బర్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాడు హరీశ్‌. రీమేక్ మూవీల్లో ఓ రేంజ్ బ్లాక్‌బస్టర్ అయిన తొలి మూవీ గబ్బర్ సింగే. అప్పటి నుంచి ఇప్పటిదాక రీమేక్ సినిమాలు ఆ రేంజ్‌లో హిట్ అయిన దాఖలాలు లేవు. గబ్బర్ సింగ్‌ మూవీ అటు పవన్‌కు.. ఇటు హరీశ్‌కు.. ఇంకోవైపు ఆ టైంలో ఐరెన్‌లెగ్‌గా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నశ్రుతి హాసన్‌ కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. ముఖ్యంగా శ్రుతి హాసన్‌ దశ తిరిగి తన కెరీర్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ అంత ఫాస్ట్‌గా దూసుకెళ్లింది. గబ్బర్ సింగ్ మూవీతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల హిట్‌లిస్ట్‌లో చేరారు హరీశ్ శంకర్.

గబ్బర్ సింగ్‌ మూవీతో హరీశ్ శంకర్ దశ తిరిగింది. వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఆ ఊపులోనే జూనియర్ ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. మళ్లీ ఫ్లాప్‌ ట్రాక్‌లో పడిపోయారు హరీశ్ శంకర్. మళ్లీ సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ మూవీస్‌తో బ్లాక్‌బస్టర్ ట్యాగ్‌ని అలాగే కొనసాగించారు. 2019 లో వచ్చిన గద్దల కొండ చిత్రం తర్వాత హరీశ్‌ నుంటి మరే సినిమా రాలేదు.

- Advertisement -

పవన్ కల్యాణ్‌తో భవదీయుడు భగసింగ్ మూవీ ప్రకటించి చాలా రోజులే అయినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఓవైపు పవన్ పాలిటిక్స్‌లో మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరహర వీరమల్లు మూవీ, ఇతర రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పూర్తయ్యే వరకు ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. అందువల్ల ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కష్టమే.

అయితే హరీశ్ శంకర్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఈ డైరెక్టర్‌ని ఓ స్టార్ హీరో అవమానించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో ఫాలోయింగ్ సంపాదించిన ఓ టాలీవుడ్ స్టార్‌హీరో గతంలో హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. అప్పటికే ఆ హీరోకు వరుస ప్లాపులు ఉండడంతో, ఏ డైరెక్టర్ తనకు హిట్ ఇవ్వలేకపోతున్నాడని హరీశ్‌ శంకర్ వద్ద వాపోయాడట. ‘ప్రస్తుతం నేను నీతో చేస్తున్న సినిమా ఎలాగూ హిట్ అవుతుంది, ఆ తర్వాత నీకు మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని అన్నాడట హరీశ్‌. ఆ స్టార్ హీరో ఈగో హర్ట్ అయ్యి .. నువ్వేంటి నాకు హిట్ ఇచ్చేది, ఇండస్ట్రీలో నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో, నోరు మూసుకున్నాడట హరీశ్‌. అయితే ఈ ఈగో క్లాష్ తర్వాత ఆ స్టార్ హీరోతో హరీశ్‌ చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అప్పటి నుంచి ఆ హీరో హరీశ్‌తో మరో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here