Oscar Nominations : ఇప్పటివరకు ఆస్కార్‌కు నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు ఇవే

- Advertisement -

Oscar Nominations : 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. వివిధ కేటగిరిల్లో పలు చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో దాదాపు 300ల సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కు షార్ట్‌లిస్ట్‌ అవగా, వాటిలో ఉత్తమ చిత్రాలు ఇప్పుడు అవార్డుల బరిలో నిలిచాయి. భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం అధికారికంగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను నామినేషన్‌కు పంపినా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

Oscar Nominations
Oscar Nominations

1957 నుంచి ఇప్పటివరకూ మొత్తం 54 చిత్రాలు భారత్‌ నుంచి ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌కు వెళ్లాయి. వాటిలో తెలుగు చిత్రం ‘స్వాతిముత్యం’ కూడా ఉంది. నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సందర్భంగా అసలు ఇప్పటి వరకు ఎన్ని ఇండియన్ సినిమాలు ఆస్కార్ కేటగిరీల్లో చోటు దక్కించుకున్నాయని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్‌ రేసులో ఆయా కేటగిరిల్లో తుది జాబితాలో నిలిచిన భారతీయ చిత్రాలు ఏవో చూద్దాం రండి..!

మదర్‌ ఇండియా

- Advertisement -

ఇండియా నుంచి తొలిసారి ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రం ‘మదర్‌ ఇండియా’(1957). మెహబూబ్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నర్గీస్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌, రాజ్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. దేశంలోని గ్రామాల పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సగటు భారతీయ స్త్రీ, తన కుటుంబం కోసం, తన పిల్లలకోసం పడే కష్టాలను భావోద్వేగభరితంగా చూపించారు.

mother india
mother india

సలామ్‌ బాంబే

1988లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘సలామ్‌ బాంబే’ ఆస్కార్‌కు నామినేషన్‌ సాధించింది. మీరా నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షఫీక్‌ సయీద్‌, హంస విఠల్‌, చందా శర్మ, నానా పటేకర్‌, రఘువీర్‌యాదవ్‌, అనిత కన్వర్‌ కీలక పాత్రలు పోషించారు. అప్పటి ముంబయిలోని వీధి బాలల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తీర్చిదిద్దారు. మురికివాడల్లో నివశించే చిన్నారుల రోజువారీ జీవితాలను ఇందులో ప్రతిబింబించారు.

లగాన్‌

ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మూడో చిత్రం ‘లగాన్‌’. ఆమిర్‌ఖాన్‌ కీలకపాత్రలో అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గ్రేసీ సింగ్‌, రాచెల్‌ షెల్లీ, పాల్‌ బ్లాక్‌ థ్రోన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది.

RRR

లగాన్‌’ తర్వాత ఇప్పటివరకూ మరే ఇండియన్ సినిమా ఆస్కార్‌ అవార్డుల తుదిపోరులో నిలవలేదు. ఆ సినిమా తర్వాత తెలుగు నుంచి ఇప్పుడు ‘RRR’ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి తుది జాబితాలో చోటు దక్కించుకుంది. ఓ తెలుగు సినిమా ఆస్కార్ బరి వరకు వెళ్లడం తెలుగు సినిమా చరిత్రలోనే ఇది మొదటిసారి.. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కాలభైరవ-రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here