తల్లితండ్రులు కాబోతున్న మరో స్టార్ కపుల్‌..!‘గుండెల్లో గోదారి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ విభిన్న పంథాలో తన కెరీర్‌ను సాగిస్తున్నాడు. ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’, ‘నీవెవరో’’,’ యూ టర్న్‌’, ‘గుడ్‌ లక్‌ సఖి’ వంటి చిత్రాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఆరు నెలల క్రితం తన కోస్టార్, ప్రేయసి అయిన కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కాక్కా’ కోసం మొదటిసారి ఆది- నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్‌లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ఏడాది మేలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

ఈ లవ్ కపుల్‌కి సంబంధించి ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ గుడ్‌న్యూస్ వైరల్ అవుతోంది. నిక్కీ గల్రానీ గర్భం దాల్చారన్న వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయి. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తిందో ఎదురుచూడాలి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లో చాలా మంది కపుల్ గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్‌లు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.