Orange : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘ఆరెంజ్’ చిత్రం అప్పట్లో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచి ఉండొచ్చు,కానీ ఇప్పుడు అదే సినిమాని ఆయన పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేస్తే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఒక సూపర్ హిట్ సినిమా విడుదల అయితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, అలాంటి రెస్పాన్స్ ఈ సినిమాకి వచ్చింది, ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని నిర్మాత నాగబాబు మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు.

మొదటి రోజు కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మాత్రమే షోస్ వేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక రెండవ రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో షోస్ ప్రదర్శించారు,బంపర్ ఓపెనింగ్ వచ్చింది.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా ఓపెనింగ్ రోజు కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక మూడవ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడవ రోజు దాదాపుగా 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని అంటున్నారు ఆరెంజ్.ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలలో మూడవ రోజు కూడా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం ఎప్పుడు జరగలేదు.

ఒక రామ్ చరణ్ కొత్త సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో, అలా ఉంది ఆరెంజ్ మూవీ రీ రీలీజ్ అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి నేడు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి,నేడు కూడా ఈ చిత్రానికి మరో 75 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.అలా రేపటి వరకు ఈ సినిమాకి మూడు కోట్ల 30 లక్షల గ్రాస్ రాబట్టనుంది అని అంటున్నారు విశ్లేషకులు.
