Orange Re Release : మ్యూజికల్ కన్సర్ట్స్ గా మారిపోయిన ‘ఆరెంజ్’ థియేటర్స్.. ఇదేమి రెస్పాన్స్ బాబోయ్!

- Advertisement -

Orange Re Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన సినిమాలలో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘ఆరెంజ్’.మగధీర వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన లవ్ స్టోరీ కావడం, అంచనాలు భారీ రేంజ్ లో ఉండడం , దానికి తోడు అప్పట్లో ఈ సినిమా ఎవరికీ అర్థం కాకపోవడం వల్ల డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.కానీ సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చిన తర్వాత నెటిజెన్స్ ఈ సినిమాని బాగా చూసారు.

Orange Re Release
Orange Re Release

వాళ్లకి ఈ చిత్రం ఎంతగానో నచ్చింది,సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి కానీ సినిమా మాత్రం సరిగా ఆడలేదు.అప్పట్లో ఈ సినిమాకి వచ్చిన నష్టాల వల్ల ఆ చిత్ర నిర్మాత నాగబాబు ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.ఈ విషయాన్నీ స్వయంగా నాగబాబు గారే తెలిపారు.అలాంటి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తుంది.

Orange Movie Re Release

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నేడు ఘనంగా విడుదల చేసారు.ఫ్లాప్ సినిమాని ఎవరు చూస్తారులే అని అనుకున్నారు, కానీ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఎవ్వరూ ఊహించనిది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించిన సినిమాలు కేవలం రెండే రెండు.

- Advertisement -

ఒక పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి‘ కాగా, మరొకటి అదే పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమా. ఈ రెండు సినిమాలు తర్వాత ఆ కోవలోకి చెందిన మరో మూవీ ‘ఆరెంజ్’ మాత్రమే. అయితే ఈ సినిమా కి థియేటర్స్ లో ఫ్యాన్స్ చేసిన రచ్చకి సంబంధించిన వీడియో లు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద పెడుతున్నాము చూడండి.ముఖ్యంగా పాటలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఇచ్చిన రియాక్షన్స్ చూస్తే రెండు కళ్ళు సరిపోవు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here