Dasara First Review : నాని విజ్రంభించాడుగా.. పుష్పను మించిన క్లైమాక్స్..

- Advertisement -

Dasara First Review : న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం దసరా మూవీలో చేస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే విడుదలకానుంది.. ఈ సినిమాలో నాని మొదటి సారి మాస్ లుక్ కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Dasara First Review
Dasara First Review

దసరా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడం పూర్తిస్థాయి డీ గ్లామర్ లుక్ లో నాని కనిపించడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది..

ఈ సినిమాలో నాని పక్కా మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు..నానికి ఏ మాత్రం తగ్గకుండా కీర్తి సురేష్ నటిస్తుంది.. ఈ సినిమా కథ తెలంగాణ నేపథ్యం లో ఉండటంతో సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు…ఇకపోతే ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది..నైజాం ప్రాంతంలో అత్యధిక రేటుకు అమ్ముడు పోయింది. 14 కోట్ల రూపాయలకి ఈ సినిమా హక్కులు నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్నారు.

- Advertisement -
dasara movie

ఇక ఉత్తరాంధ్ర మూడు కోట్ల 90 లక్షలు, ఈస్ట్ గోదావరి రెండు కోట్ల 30 లక్షలు, వెస్ట్ గోదావరి రెండు కోట్లు, గుంటూరు మూడు కోట్లు, కృష్ణా రెండు కోట్లు నెల్లూరు కోటి 30 లక్షలు వెరసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో 35 కోట్ల రూపాయల మేర ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి. ఇక మిగతా భారతదేశం అంతా కలిపి మూడు కోట్లకు అమ్ముడుపోతే ఓవర్సీస్ లో ఆరు కోట్లకు ఈ సినిమా హక్కుల అమ్ముడయ్యాయి. మొత్తం మీద ఈ సినిమా 44 కోట్ల థియేటర్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా 45 కోట్లు వసూలు చేస్తే హిట్టుగా పరిగణించబడుతుంది.

మరి చూడాలి నాని సినిమా ఎంతవరకు వసూళ్లు సాధించి నానీని నిలబెడుతుంది అనేది.. ఇప్పటివరకు అందుతున్న సమాచారం.. ఈ సినిమాలో యాక్షన్ అలాగే స్టెంట్స్ కూడా ఫస్ట్ లెవెల్ లో ఉన్నాయని ఇది ఈ పుష్ప 2.0 కొత్త వర్షన్ లాగా అనిపిస్తోందని ఆయన తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూనే ఐదు మార్కులకు గాను మూడున్నర మార్కులు తాను వేస్తున్నట్టుగా రేటింగ్ కూడా ఇచ్చేశాడు. దీంతో నాని దసరా సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో అంచనాల అంతకంతకూ పెరుగుతున్నాయి.. మరి సినిమా నానికి ఏ మాత్రం హిట్ ను అందిస్తుందో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది..

సినిమా: దసరా
నటీనటులు: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, షమ్నా కాసిం, సజోల్ చౌదరిమోర్…
దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల
రచయిత: శ్రీకాంత్ ఓదెల
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీ : మార్చి 30,2023

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here