Keerthy Suresh : ఆ కేజ్రీ హీరో పై మనసుపడ్డ కీర్తి సురేష్..వైరల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

Keerthy Suresh : విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.మేకర్స్ కి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యాల్సి వస్తే వాళ్లకు గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్.టాలీవుడ్ , కోలీవుడ్ మరియు మాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లోను స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ నటనకి ప్రాధాన్యత ఉన్నవే.

Keerthy Suresh
Keerthy Suresh

ముఖ్యంగా ‘మహానటి’ సినిమాలో సావిత్రి గారి పాత్రని పోషించి అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆమె నేషనల్ అవార్డు కూడా దక్కింది.నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డు దక్కించుకున్న ఏకైక సౌత్ స్టార్ కీర్తి సురేష్ మాత్రమే.ఇప్పుడు మరోసారి అదే రేంజ్ పెర్ఫార్మన్స్ ని ‘దసరా’ మూవీ లో చేసిందట.న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ చిత్రం, ఈ నెల 30 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కానుంది.

Dasara MOvie

ఈ సందర్భంగా మూవీ ప్రొమోషన్స్ లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది.కేవలం తెలుగు వెర్షన్ ప్రొమోషన్స్ లో మాత్రమే కాదు, హిందీ వెర్షన్ ప్రొమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది.నిన్న ముంబై లో ప్రెస్ తో మాట్లాడుతున్న కీర్తి సురేష్ ఒక విలేఖరి ‘బాలీవుడ్ లో మీరు ఏ హీరో తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు’ అని అడగగా కీర్తి సురేష్ నిమిషం కూడా ఆలోచించకుండా ‘షారుఖ్ ఖాన్’ అని సమాధానం చెప్పింది.

- Advertisement -
SHah Rukh Khan

చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగానని, ఆయన అంటే ఎంతో ఇష్టమని, ఆయన పక్కన కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాదు, ఒక చిన్న క్యారక్టర్ ఇచ్చిన చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.మరి షారుఖ్ ఖాన్ ఈమెకి ఆ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి, ప్రస్తుతం కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘భోళా శంకర్’ చిత్రం లో నటిస్తుంది, ఈ సినిమాతో పాటుగా పలు తమిళ సినిమాల్లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here