Ram Charan : ర‌వితేజ రూట్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్‌.. డేరింగ్ స్టెప్పే.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?

- Advertisement -

Ram Charan : టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తున్న హీరో ఎవరూ అంటే మన అందరికీ గుర్తుకొచ్చే పేర్లలో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవినే మించిపోయాడు.. ఆయన సాధించలేకపోయిన ఎన్నో అరుదైన ఘనతలు మరియు కీర్తి ప్రతిష్టలను రామ్ చరణ్ పొందుతున్నాడు.. నటుడిగా కూడా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు పోషించని పాత్రలను పోషిస్తూ తండ్రిని కూడా అసూయపడేలా చేస్తున్నాడు.

Ram Charan
Ram Charan

రామ్ చరణ్ 13 సినిమాలు చేస్తే అందులో అభిమానులు మరియు ప్రేక్షకులు చిరాస్తాయిగా గుర్తుంచుకునే సినిమాలు మూడు ఉన్నాయి.. అవి మగధీర,రంగస్థలం మరియు #RRR.. ఈ మూడు సినిమాలు రామ్ చరణ్ ని ఒక స్టార్ గా మరియు నటుడిగా ఎక్కడికో తీసుకెళ్లాయి.. మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆయన పోషించిన చిట్టి బాబు పాత్ర, తెలుగు సినిమా చరిత్ర పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడినది గా చెప్పుకోవచ్చు.

రంగస్థలం చిత్రం లో రామ్ చరణ్ చెవిటివాడిగా అద్భుతంగా నటించాడు.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.. అందులో ఒక పాత్ర కి నత్తి.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.. ఇందులో ఆయన పాత్ర కి కళ్ళు కనిపించవు అట.. ఒక పల్లెటూరిలో కళ్ళు సరిగా కనపడని ఒక కుర్రాడి రివెంజ్ డ్రామా గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట బుచ్చి బాబు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది.

- Advertisement -

కానీ అభిమానులు #RRR వంటి సినిమా తర్వాత ఇలాంటి ప్రయోగాలు అవసరమా..ఒక కమర్షియల్ హీరో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఎవరైనా చూస్తారా అని భయపడుతున్నారు.. కానీ కమర్షియల్ హీరో తో ఎవ్వరూ ప్రయోగాలు చెయ్యరు.. రంగస్థలం కూడా ఒక విధంగా ప్రయోగాత్మక చిత్రమే.. కానీ కమర్షియల్ ఎలెమెంట్స్ జోడించిన తర్వాత అది ఒక అద్భుతమైన దృశ్యకావ్యం గా మారింది.. రామ్ చరణ్ – బుచ్చి బాబు మూవీ కూడా అదే విధంగా ఉంటుంది అంటున్నారు మూవీ టీం కి చెందిన సన్నిహితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here