Flora Saini : అయ్యో.. లక్స్ పాపకి ఎంత క‌ష్టం.!? ప్రైవేట్ పార్ట్స్ పై దాడి.. 14 నెలలు నరకం చూపించిన ఆ బడా నిర్మాత

Flora Saini private parts are attacked on 14 months


Flora Saini: ప్రముఖ నటి ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైనీ.. అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ లక్స్ పాప అనగానే ఇట్టే గుర్తు పట్టేయొచ్చు.. తెలుగులో విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో కూడా నటించింది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.. ఆశా షైనీ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ మధ్యకాలంలో మీటూ ఉద్యమం బాగా వెలుగులోకి వచ్చినప్పుడు ఎంతో మంది నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పబ్లిక్ గానే పంచుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఆశా సైనీ కూడా చేరింది. ప్రముఖ నిర్మాత తనను మోసగించాడని.. 14 నెలల పాటు లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన ప్రైవేటు భాగాలపై గాయపరచడని.. దారుణంగా హింసించేవాడని.. తన నా ఫోన్ లాక్కొని బలవంతం చేసేవాడని.. నటన మానేయాలని 14 నెలలు చిత్రహింసలు పెట్టాడని.. నన్ను ఎవరితో మాట్లాడాను ఇవ్వకుండా చేశాడు..

14 నెలలు పాటు నన్ను బంధించి ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. అయితే ఆ నరకం నుంచి నేను పారిపోయి బయటకు వచ్చాను. ఆ నరకం నుండి నేను కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని ఆశ సైనీ తెలిపారు. ఇలా ఆ నరకం నుంచి తనని ఇష్టపడే వారి దగ్గరకు చేరుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని.. ప్రస్తుతం తాను తన తల్లిదండ్రుల వద్ద ఉన్నానని.. నన్ను ఇష్టపడే వారి మద్దతులో సంతోషంగా ఉన్నాను.. నా తల్లిదండ్రులతో ఆనందంగా ఉన్నాను అని తెలుపుతూ ఓ వీడియో ను పంచుకున్నారు ఫ్లోరా సైనీ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ నిర్మాత ఎవరు అనేది మాత్రం ఆశా సైనీ బయట పెట్టలేదు.