OG Making Video : సోషల్ మీడియా లో #OG మేకింగ్ వీడియో ప్రభంజనం.. 1000 కోట్ల మార్కెట్ పై కన్నేసిన పవర్ స్టార్

- Advertisement -

OG Making Video : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలను ఏర్పర్చుకున్న చిత్రం #OG..యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా షూటింగ్ నేడు ముంబై లో ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా స్క్రిప్ట్ ని మేకింగ్ చేస్తున్నట్టుగా సుజిత్ #OG కాన్సెప్ట్ ని వివరిస్తూ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

OG Making Video
OG Making Video

ఇంత స్టైలిష్ గా షూటింగ్ ప్రారంభం అయ్యింది అని చెప్పిన వీడియో ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాలేదు.కేవలం షూటింగ్ వీడియో తోనే ఫ్యాన్స్ ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేసాడు డైరెక్టర్ సుజిత్.ఇందులోనే ఆయన పనితనం అంత చూపిస్తే ఇక టీజర్ , ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ అప్పుడు ఇక ఏ రేంజ్ లో చూపిస్తాడో అర్థం అచేసుకోవచ్చు.సినిమా విడుదల సమయానికి ఈ చిత్రం హైప్ ఎవ్వరి ఊహకి అందని విధంగా ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Pawan Kalyan OG Making Video

ఈ చిత్రాన్ని #RRR మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్కేల్ లో నిర్మిస్తున్నారు.వీడియో చూస్తూ ఉంటే ఒక గ్యాంగ్ స్టర్ మూవీ కి కావాల్సిన అన్నీ అంశాలు ఇందులో పొందుపర్చినట్టు తెలుస్తుంది.కేవలం క్లైమాక్స్ సన్నివేశం కోసమే 16 డ్రాఫ్టులు రాసుకున్నాడు డైరెక్టర్ సుజిత్. దీనిని బట్టీ చూస్తే అతనికి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సినిమా గిఫ్ట్ అవ్వాలనే కసి ఉందో అర్థం అవుతుంది.

- Advertisement -
OG Movie

ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్నీ సరిగ్గా సమయానికి జరిగితే ఈ ఏడాదిలోనే ఈ సినిమా మన ముందుకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే #OG సినిమా ఈ ఏడాది డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. త్వరలోనే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారట. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో కొడితే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే విధంగానే బలమైన స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడట పవర్ స్టార్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here