Pawan Kalyan : OG పై అసత్య వార్తలు పుట్టిస్తున్నది అతనేనా? పవన్ కళ్యాణ్ అంటే ఇంత పగ ఎందుకు!

- Advertisement -

Pawa Kalyan ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఆకాశాన్ని తాకే అంచనాలను ఏర్పర్చుకున్న చిత్రం #OG.. ప్రముఖ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు, ఇటీవలే షూటింగ్ పూజా కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉంటున్నాడు డైరెక్టర్ సుజిత్.ఇలా ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు మరియు ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

pawan kalyan
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ, మెగా హీరోలకు సంబంధించి కానీ ఏ చిన్న పాజిటివ్ న్యూస్ వినిపించినా అభిమానుల్లో నిరుత్సాహాన్ని నింపి గందరగోళం చెయ్యడానికి పచ్చ మీడియా మరియు నీలి మీడియా ఎప్పుడూ రెడీ గానే ఉంటుంది,అందుకే #OG విషయం లో ఇప్పటి నుండే బురద చల్లడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది. అందులో ఒక నీలి మీడియా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పాటలు మరియు ఫైట్స్ ఉండవు అంటూ ఈ సినిమా పూజా కార్యక్రమం ముందు రోజు ఒక అసత్యపు ప్రచారం ని మొదలెట్టింది.

pawan kalyan sujeeth

అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని మూవీ టీం స్పష్టత ఇచ్చింది.ఇక ఆ తర్వాత ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందని, ఆ చిత్రం కోసం కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించాడని వార్తలు పుట్టించారు..ఆ తర్వాత మూవీ టీం ని సంప్రదిస్తే పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు నెలల పాటుగా డేట్స్ ఇచ్చాడని తెలిసింది.ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయ్యి, తెలుగు లో కూడా దబ్ అయినా ‘ఎంతవాడు గానీ’ అనే చిత్రానికి రీమేక్ అంటూ ప్రచారం మొదలెట్టారు.

- Advertisement -
thaman ss

ఇది కూడా అసత్య వార్తలే అని తర్వాత తెలిసింది. ఇలా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రత్యర్థులు.కానీ పవన్ కళ్యాణ్ ని ఆపడం ముఖ్యమంత్రి వల్లే అవ్వలేదు, ఇక ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపగల్తాయా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

pawan kalyan og movie
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here