అమెరికాలో NTR కు ఘోర అవమానం.. ఇదిగో ప్రూఫ్.. వీడియో వైరల్..

- Advertisement -

NTR తెలుగు రాష్ట్రాల్లో నందమూరి – మెగా ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. కొన్ని ఏళ్ల నుంచి ఏదొక విషయం పై వార్ నడుస్తుంది.. దాన్ని రాజమౌళి సైతం దూరం చేయలేరని నిరూపితమైంది. అసలు ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారన్న వార్తే ప్రకంపనలు రేపింది.. దీనిపై అప్పట్లో ఎన్ని వార్తలు వచ్చాయో తెలియంది కాదు..ఇదెలా సాధ్యం, తేడా కొడితే గొడవలు ఖాయమానుకున్నారు. ఎవరిని తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ నుండి రాజమౌళి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రాజమౌళికి పెద్ద ఛాలెంజ్. కారణం హీరోలు ఎవరైనా సినిమాకు కథ, కథనాలే ప్రాణం.. ఎలాగో సినిమా వల్ల గొడవలు తగ్గాయి.. అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మొదలైయ్యాయి..

NTR
NTR

అయితే, రాజమౌళి ఫ్యాన్స్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకొనే చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు. ఆయనకో ఇంట్రో ఈయనకో ఇంట్రో, సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ పాత్రను చరణ్ గైడ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. రామ్ చదువుకున్న పోలీస్, భీమ్ గోండు జాతి అడవి బిడ్డ. బహుశా అందుకే రాజమౌళి భీమ్ పాత్రను ఇన్నోసెంట్ గా, రామ్ ని ఇంటెలిజెంట్ గా చూపించి ఉండొచ్చు. అలాగే చరణ్ పాత్రలో ఉన్నన్ని షేడ్స్ ఎన్టీఆర్ పాత్రలో లేవు. అయినప్పటికీ ఎన్టీఆర్ కి కూడా రాజమౌళి అద్భుతమైన సీన్స్ రాశారు..

https://twitter.com/AlwaysRCever/status/1633411889987473409?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1633411889987473409%7Ctwgr%5E6ce29bc232328e8cb0aa52fde3dfe581de1272a1%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

ఇప్పుడు సినిమా వచ్చి ఏడాది అవుతున్న తర్వాత వార్ నడుస్తుంది..ఇక సినిమా విడుదలైనప్పటి నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. మా వాడు గొప్పంటే మావాడు గొప్పంటూ, వాదులాడుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల చౌకబారు చర్యలు అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యాయి. HCA వంటి సంస్థ సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అంటూ చరణ్ ఫ్యాన్స్ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు.. ఇటీవల చరణ్ ఓ ఇంటర్వ్యూ కు వెళ్ళాడు..

- Advertisement -

ఆ షోలో హోస్ట్ ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అని పిలిచినట్లు ఎగతాళి చేస్తూ చరణ్ ఫ్యాన్స్ ఒక ఎడిట్ వీడియో వైరల్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒరిజినల్ వీడియో బయటకు తీశారు. హోస్ట్ ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అనలేదు, చరణ్ తో పాటు నటించిన నటుడు అన్నాడు. చరణ్ ఫ్యాన్స్ ఎడిట్ చేసి దాన్ని… సైడ్ యాక్టర్ అని ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరో రెండు రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుండగా ఎన్టీఆర్,రామ్ చరణ్ ఫ్యాన్స్ వార్ నడుస్తుంది..మరి దిగజారి గొడవలు పడుతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఇది ఎన్ని గొడవలకు దారి తీస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here