Nidhhi Agerwal : అబ్బా ఎంత ప్రేమో.. ఇంట్లో ఖాళీగా ఉన్న నిధి ఇలాంటి పని చేస్తుందా?



Nidhhi Agerwal అనడం కన్నా బోల్డ్ బ్యూటీ అంటే అందరూ గుర్తు పడతారు.. ఆ సినిమా అంత పేరును తీసుకువచ్చింది.ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.. తాజాగా మరోసారి ఓ పోస్ట్ చేసి ట్రెండ్ అవుతుంది.. ఆమె తన పెంపుడు కుక్క బాగోగులను చూసుకుంటుంది.. నిధికి డస్టర్ అనే పెట్ డాగ్ ఉంది.

దాని బొచ్చు ఇల్లంతా పడుతుందట. అది కంట్రోల్ చేయడానికి తనకో పరికరం దొరికింది. సదరు ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. అది వైరల్ అయ్యింది..అబ్బా ఎంత ప్రేమో.. ఇంట్లో ఖాళీగా ఉన్న నిధి ఇలాంటి పని చేస్తుందా అంటూ కామెంట్లను అందుకుంటుంది..


Nidhhi Agerwal
Nidhhi Agerwal

ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కూడా సోషల్ మీడియా ప్రమోషన్స్ తో నిధి డబ్బులు సంపాదిస్తున్నారు. వరుస ప్లాప్స్ ఆమె సతమతమవుతున్నారు. 2022లో ఆమె ‘హీరో’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో చేరింది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది.

Nidhhi Agerwal Dog

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు ఈ ఏడాది విడుదల కానుంది. నిధి అగర్వాల్ ఆశలన్నీ హరి హర వీరమల్లు మీద పెట్టుకుంది. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారు. హరి హర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి ప్లస్ అవుతుంది..లేదంటే మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తుంది.. ఎం జరుగుతుందో చూడాలి..