Ileana : అయ్యయో.. ఇలియానా పరిస్థితి ఇంత దారుణంగా మారిందే.. ఏమైందబ్బా?

- Advertisement -

Ileana : ఈ మధ్య కాలంలో ఇలియానా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ప్రయత్నాలు చేసింది. బికినీ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. అయితే సడెన్ కొద్ది రోజుల నుంచి ఇలియానా సైలెంట్ అయ్యింది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఇలియానా అనారోగ్యం బారినపడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Ileana D'Cruz
Ileana D’Cruz

ఆ విషయం విన్న ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. మూడు బ్యాగ్స్ ఫ్లూయిడ్స్ ఎక్కించారట. డాక్టర్స్ పర్యవేక్షించారట. తన అనారోగ్యం గురించి ఇంస్టాగ్రామ్ లో ఇలియానా తెలియజేసింది. అది కాస్త వైరల్ అవుతుంది..ఇలియానా రామ్ పోతినేని హీరోగా వచ్చిన దేవదాసు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది గోవా బ్యూటీ..

ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తుంది.. ఆ తర్వాత వచ్చిన పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.. ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాప్ స్టార్స్ తో జతకడుతూ హిట్ టాక్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ ఇండియాలో ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఆమె బాలీవుడ్ పై కన్నేసి కెరీర్ నాశనం చేసుకుంది.

- Advertisement -

2012లో రన్బీర్ హీరోగా విడుదలైన బర్ఫీ చిత్రంలో ఇలియానా నటించారు. ప్రియాంక చోప్రా మరో హీరోయిన్. ప్రయోగాత్మకంగా తెరకేక్కిన ఈ సినిమా విమర్శలను అందుకుంది.. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. ఊరకే వచ్చిన స్టార్డం కావడంతో ఆమెకు దాని విలువ తెలియలేదు. బాలీవుడ్ లో కూడా తన జర్నీ కేక్ వాక్ అనుకుంది.

అయితే ఆమెకు దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. వరుస ప్లాప్స్ తో ఎక్కడికో పడిపోయింది.. ఏ ఇండస్ట్రీకి వచ్చిన కూడా మంచి టాక్ ను అందుకోలేక పోయింది.. అలాగే లవ్ లో కూడా పడింది.. అది బ్రేకప్ అవ్వగానే బరువు పెరిగింది.. బరువు తగ్గి యథాస్థితికి చేరుకున్నారు. అయితే ఆమె కెరీర్ గాడిన పడలేదు. అడపదడపా చిత్రాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటుంది.. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది.. రెండు ప్రాజెక్టు లలో చేస్తున్నట్లు తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here