Pawan Kalyan : ఆ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. రీజన్ ఏంటంటే?

- Advertisement -

పవర్ స్టార్ Pawan Kalyan రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు రాజకీయాల్లో రానిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉంటున్నారు.ఈయన కమిట్మెంట్ లను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ”హరిహర వీరమల్లు” ఒకటి.. ఈ సినిమా సగానికి పైగానే పూర్తి చేసుకుంది.. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది.. ప్రస్తుతం ఈ సినిమాపై అప్డేట్ లపై డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 Pawan Kalyan
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.. ఈ సినిమాను ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ ను వదులుతామని చెప్పారు.. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు..

Hari Hara Veera Mallu

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజ్ ఉంటూనే ఉంది.. అయితే ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ తప్పేలా లేదు.. ఎందుకంటే ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవకాశమే లేదు అని వార్తలు వస్తున్నాయి.. మేకర్స్ సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తాం అని ఇటీవల స్టేట్మెంట్స్ ఇచ్చారు.

- Advertisement -

కానీ అది సాధ్యం అయ్యేలా లేదు అని అంటున్నారు. అందుకే ఈ సినిమాను దసరా కానుకగా భారీగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.. ఈసినిమా షూటింగ్ ఇంకా మిగిలే ఉంది.. మరి ఆ షూటింగ్ కు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడో.. సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here