Sreemukhi: బుల్లితెర రాములమ్మ బన్​గయి గంగూబాయి

- Advertisement -

శ్రీముఖి.. సోషల్ మీడియాలో ఈ యాంకర్ ఓ సెన్సేషన్. బుల్లితెరపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వెండితెరపైనా మంచి పాత్రల్లో నటించింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా.. ఈ అమ్మడి ఫోకస్ అంతా బుల్లితెరపైనే. శ్రీముఖిని తన అభిమానులంతా ముద్దుగా రాములమ్మ అని పిలుస్తుంటారు. తాజాగా ఈ రాములమ్మ గంగూబాయిగా మారిపోయింది. ఓ షో కు యాంకరింగ్ చేస్తున్న Sreemukhi.. ఆలియా భట్ నటించిన గంగూబాయి మూవీలో ఆలియా స్టైల్లో రెడీ అయింది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
sreemuhki-photos

సోషల్ మీడియాలో శ్రీముఖి ఫ్యాన్స్.. ఈ ఫొటోలకు తెగ ఫిదా అయిపోతున్నారు. రాములమ్మ బన్​గయి గంగూబాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీ ఏ డ్రెస్సు వేసిన అందంగా ఉంటుంది.. ఏ ఫోజు పెట్టినా చందమే అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

sreemukhi

- Advertisement -

ఇక శ్రీముఖి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ భామ తన ఫోకస్ అంతా టీవీపైనే పెట్టింది. తన తోటి యాంకర్స్ అనసూయ, రష్మి సినిమాల వైపు వెళ్తుంటే ఈ బ్యూటీ మాత్రం అన్ని ఛానెళ్లలో కనిపిస్తోంది. అందిన అవకాశాలు యూజ్ చేసుకుంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్ పెట్టి తన వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకుంటుంది. ఈ అమ్మడు యూట్యూబ్ ఛానెల్​కి బోలెడ్ సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ఆ ఛానెల్​లో శ్రీముఖి.. తన టూర్ల గురించి.. కుకింగ్.. ఫ్యాషన్.. పార్టీలకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్​ని ఖుచ్ చేస్తూ ఉంటుంది.

sreemukhi gangubhai photos

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here