కాఫీ ఇవ్వలేదని బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టిన శివాజీ.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

బుల్లితెర మీద సంచలన విజయం సాధించిన రియాలిటీ షో ఏమిటి అని అడిగితే ప్రతీ ఒక్కరు చెప్పే పేరు బిగ్ బాస్. ఉత్తరాదిన సంచలన విజయం సాధించిన ఈ రియాలిటీ షో ని తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయం చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. ఇక్కడ హిట్ అవుతుందో లేదో అనే అనుమానం తోనే ప్రారంభించారు, కానీ ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ ని దక్కించుకొని ఏకంగా ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 7 వ సీజన్ లోకి అడుగుపెట్టింది.

బిగ్ బాస్
బిగ్ బాస్

ఈ సీజన్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ముందు సీజన్స్ లో లాగ కాకుండా ఈ సీజన్ లో చాలా కఠినతరమైన రూల్స్ ని పరిచయం చేసాడు బిగ్ బాస్. పడుకునే బెడ్ దగ్గర నుండి కూర్చునే ఫర్నిచర్ వరకు ప్రతీ ఒక్కటి పోరాడి గెలుచుకోవాల్సిందే. అలా చెయ్యడం వల్ల మొదటి రోజు నుండే ఆట రసవత్తరంగా సాగడం మొదలైంది.

ఇక ఈ బిగ్ బాస్ హౌస్ లోకి సీనియర్ హీరో శివాజీ కూడా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈయన ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తనకి కాఫీ ఇవ్వలేదని , బిగ్ బాస్ కావాలని నన్ను రెచ్చగొట్టి నా పరువు తీద్దామని చూస్తున్నాడని, ఇంటికి వచ్చి నాలుగు రోజులు అయినా కూడా ఇప్పటి వరకు నాకు కాఫీ ఇవ్వలేదని, ఇది కరెక్ట్ కాదు అంటూ శివాజీ రెచ్చిపోయాడు.

- Advertisement -

నేనేమి చిన్న మనిషిని కాదు, జనం కోసం పని చేసిన వ్యక్తిని, పెద్ద పెద్ద వాళ్ళను చూసినోడిని, ఈ బిగ్ బాస్ హౌస్ నాకు అవసరం లేదు, కేవలం ఇక్కడి నుండి ఒక్క గంటలో వెళ్ళిపోతా చూడు అంటూ చిటికెలు వేస్తూ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇస్తాడు శివాజీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. మరి వీకెండ్ లో నాగార్జున రియాక్షన్ దీనికి ఎలా ఉంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here