Nayanthara : 10 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటర్వ్యూ.. ఏం చెప్పిందో తెలుసా..?

- Advertisement -

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓ మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచి ఎన్నో ఆశలు.. మరెన్నో కలలతో రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది Nayanthara . మొదట్లో అందరు హీరోయిన్లలాగే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ మేల్ డామినేటెడ్ ప్రపంచంలో తలెత్తుకని బతకాలంటే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని డిసైడ్ అయింది. అందుకే వచ్చిన అవకాశాలన్నింటిని అందుకుంటూ తనలోని నటిని మెరుగుపరుచుకుంటూ ఇవాళ లేడీ సూపర్ స్టార్​గా ఎదిగింది.

Nayanthara
Nayanthara

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్​గా నయనతార ఎదిగింది. నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్స్​లో పాల్గొనదు. కానీ పదేళ్ల తర్వాత ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో పాల్గొంది. అది కూడా టాలీవుడ్​లో. తన తదుపరి చిత్రం ‘కనెక్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా నయన్‌తో సుమ స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సినిమా విశేషాలతోపాటు టాలీవుడ్‌ హీరోల గురించి ఆమె ఎన్నో విషయాలు పంచుకున్నారు.

సాధారణంగా సినిమా ప్రమోషన్స్​లో పాల్గొనని నయన్​.. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడానికి గల కారణం. ఈ సినిమాను చాలా మంది థియేటర్​ యజమానులు రిలీజ్ చేయడానికి ముందుకు రాకపోవడమని అందరూ భావిస్తున్నారు. అయితే యాంకర్​ సుమ ఈ ఇంటర్వ్యూలో నయన్​ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? వాటికి నయనతార సమాధానాలేంటి..? ఓ లుక్కేద్దామా..?

- Advertisement -

ప్రీ రిలీజ్‌లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి?

నయనతార: నీతో ఇంటర్వ్యూలో పాల్గొనాలనుకున్నా. కానీ, నువ్వు ఫుల్‌ బిజీగా ఉంటున్నావు కదా. అందుకే నేను కూడా వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకు రాలేదు.

మీకు హారర్‌ సినిమాలంటే భయం లేదా?

నయనతార: నాకు హారర్‌ చిత్రాలు చూడాలన్నా, చేయాలన్నా ఇష్టమే. ఆ జోనర్‌లో వచ్చిన సినిమాలు చూస్తున్నప్పుడు కాస్త భయం వేసినట్లు ఉంటుంది. కానీ దాన్ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఫీలవుతా.

‘కనెక్ట్‌’లో భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయా?

నయనతార: భయంగా అనిపించినప్పటికీ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు థియేటర్‌ అనుభవాన్ని మెండుగా పొందుతారు.

‘కనెక్ట్‌’కు లాక్‌డౌన్‌తో ఏదైనా సంబంధం ఉందా?

నయనతార: లాక్‌డౌన్‌లో ఓ వైద్యుడి కుటుంబంలో జరిగిన సంఘటన నేపథ్యంలో దీన్ని చిత్రీకరించాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దీన్ని రూపొందించినప్పటికీ.. షూట్‌ మాత్రం ఇటీవలే చేశాం.

‘రాజా రాణి’ తర్వాత సత్యరాజ్‌తో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నయనతార: ఇదొక విభిన్న చిత్రం. పేరుపొందిన నటీనటులను ఈ కథలో భాగం చేయాలనుకున్నాం. సత్యరాజ్‌ సర్‌ మంచి నటుడు. ‘కనెక్ట్‌’లో ఆయన ఒదిగిపోయిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆయనలా ఈ పాత్రను ఎవరూ పోషించలేరు. ఆయనతో వర్క్‌ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను. ఆయనతో సెట్‌లో ఉంటే తండ్రితో కలిసి వర్క్‌ చేస్తున్న భావన కలుగుతుంది.

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌.. ఏమైనా మార్పులు చూశారా?

నయనతార : విఘ్నేశ్‌ దర్శకుడిగా ఒకలా ఉంటాడు. ఆయనకు కావాల్సిన సీన్స్‌, షాట్స్‌పైనే దృష్టి పెట్టేవాడు. ఇక, నిర్మాతగా ఆయన పూర్తి భిన్నంగా వ్యవహరిస్తాడు. ఒకరోజు ఎప్పుడైనా షూట్‌ కాస్త ముందుగానే పూర్తైతే.. వెళ్లిపోవాలనుకున్నప్పుడు.. మరో సీన్‌ చేయవచ్చు కదా. ఎందుకు వెళ్లిపోవడం అంటాడు.

మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వస్తే ఎవరు ముందు సైలెంట్‌ అయిపోతారు?

నయనతార: అలాంటిది ఏదైనా జరిగితే.. నేను సైలెంట్‌గా గుడ్‌నైట్‌ చెప్పేసి వెళ్లి పడుకుని పోతాను.

మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటివి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాయా?

నయనతార: నేను ఉన్న ఫీల్డ్‌ అలాంటిది. అందరూ నా లైఫ్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కొంతవరకూ అవి బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మరీ ఎక్కువగా నా జీవితంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటివి నన్ను కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి.

పెళ్లి అయ్యాక.. ఓ మహిళ వర్క్‌ లైఫ్‌లో మార్పులు వస్తాయని భావిస్తున్నారా?

నయనతార: పెళ్లి అయ్యాక అబ్బాయి ఏమీ మారడని.. అమ్మాయి జీవితం చాలా మారుతుందని అంటుంటారు. నేను దాన్ని నమ్మను. ఉదాహరణకు విఘ్నేశ్‌ నాకు సుమారు 9 ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అదొక్కటే మా మధ్య మారింది. పెళ్లి అయ్యాక వర్క్‌లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాలేదు. తన సపోర్ట్‌ వల్ల పెళ్లి తర్వాతే నేను ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఓకే చేశా.

లాక్‌డౌన్‌లో మీ లైఫ్‌ ఎలా సాగింది?

నయనతార: ప్రశాంతంగా నిద్రపోయాను. ఎన్నో ఏళ్ల నుంచి షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాను. విఘ్నేశ్‌ బర్త్‌డే, లేదా నా బర్త్‌డే సమయంలోనే బ్రేక్‌ తీసుకుని విహారయాత్రకు వెళ్లేదాన్ని. మధ్యలో ఎప్పుడూ బ్రేక్స్‌ తీసుకోలేదు. ప్రతిరోజూ వర్క్‌లోనే ఉండేదాన్ని. అందువల్ల లాక్‌డౌన్‌లో ఎక్కువ సమయం నిద్రలోనే గడిపేశాను.

ఏమైనా షోలు, ప్రోగ్రామ్స్‌ చూస్తారా?

నయనతార: సాధారణంగా నేను షోలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తా. అయితే లాక్‌డౌన్‌ మరీ ఎక్కువగా చూశా. దాని వల్ల కాస్త బోర్‌ కొట్టింది. అందుకే బ్రేక్‌ తీసుకున్నా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here