Bigg Boss Revanth : కూతురిని చూసి ఎమోషనల్ అయిన బిగ్ బాస్ రేవంత్..వీడియో వైరల్..

- Advertisement -

Singer Revanth : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 6 సీజన్ గత ఆదివారం గ్రాండ్ ఫినాలేను జరుపుకుంది. గత సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో 21 మంది ఇంటి సభ్యులను తీసుకోవచ్చారు.. ఒక వైపు విమర్శలు వస్తున్నా మరో వైపు సక్సెస్ టాక్ ను కూడా అందుకుంది.. ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి సింగర్ రేవంత్ మొదటి నుంచి కప్పుని టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్కులలో ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి చివరికి తన టార్గెట్ చేరుకున్నారు. చివరికి రేవంత్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకొని విజేతగా నిలిచారు. Bigg Boss Revanth

Bigg Boss Revanth
Bigg Boss Revanth

ఇక రేవంత్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లే సమయానికి తన భార్య అన్విత గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే.. హౌస్ లో కొన్ని సందర్భాల్లో రేవంత్ తన భార్య,కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తలచుకొని ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా లేక పోలేదు..రేవంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన భార్య అన్వితకు సీమంతపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ సీమంతపు వేడుకలను రేవంత్ కోసం బిగ్ బాస్ ప్రత్యేకంగా ఆ వేడుకకు సంబంధించిన వీడియోలను చూపించారు.

Bigg Boss Revanth


ఇక ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్ళిన సమయంలో తన భార్యతో ప్రత్యేకంగా వీడియో కాల్ కూడా మాట్లాడించారు. ఇలా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ రేవంత్ భార్యకు సంబంధించిన విషయాల గురించి రేవంత్ కి చేరవేశారు.ఇకపోతే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇదే విషయాన్ని కూడా బిగ్ బాస్ రేవంత్ కి తెలియజేసి తన కుమార్తె ఫోటోని కూడా చూపించారు. ఎలాగైనా తన కూతురుకు ట్రోఫీని ఇవ్వాలని కసితో ప్రతి టాస్క్ ను ఛాలెంజింగ్ తీసుకున్నాడు..

- Advertisement -
Bigg Boss Revanth
Bigg Boss Revanth

తనకు కూతురు పుట్టిందన్న సంతోషం ఒకవైపు తాను ఇలాంటి సమయంలో పక్కన లేననే బాధతో మరోవైపు రేవంత్ ఎమోషనల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ టోపీ అందుకున్న మరుక్షణం ఆయన తన కూతురిని చూడటానికి ఆత్రుత కనపరిచారు. అయితే రేవంత్ కితన కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అయితే తన కుటుంబ సభ్యులు రేవంత్ కళ్ళకు గంతులు కట్టి తన కూతురిని తన చేతిలో పెట్టారు. ఇలా రేవంత్ తన కూతురిని చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా సంతోషంతో ఎమోషనల్ అయ్యారు.తన కూతురును చూసి చాలా సంతోషించారు రేవంత్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.youtube.com/watch?v=KppxR1pUURY
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here