Nayanthara : సినిమాలకు లాంగ్ గ్యాప్​ ఇచ్చే ఆలోచనలో స్టార్​ హీరోయిన్.. అదే కారణమా..?

- Advertisement -

సూపర్​స్టార్.. సాధారణంగా ఈ బిరుదు సినిమా ఇండస్ట్రీలో టాప్​ హీరోలకు మాత్రమే ఉంటుంది. ప్రాధాన్యం, పారితోషికం, పాత్రలు ఇలా ప్రతిదాంట్లో హీరోలకే ప్రాముఖ్యత ఎక్కువ. అలాంటి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక మామూలు మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్​డమ్ కథానాయకులకే కాదు నాయికలకూ ఉంటుందని నిరూపించింది. ప్రాధాన్యతలో, పారితోషికంలో, నటనలో మగవాళ్లకు ఏ మాత్రం ఆడవాళ్లు తీసిపోరని బల్లగుద్ది చెప్పింది. హీరోలకు మాత్రమే జేజేలు కొట్టేవాళ్లతో కూడా లేడీ సూపర్​స్టార్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగింది. ఆమే లేడీ సూపర్​స్టార్ నయనతార.

రెండు దశాబ్ధాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఇప్పటి వరకూ కొనసాగుతోంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అంటారు.. కానీ ఆ ముద్రను కూడా చెరిపేసి 20 ఏళ్లుగా తన సినీ ప్రయాణం కొనసాగిస్తోంది. 2003లో ఓ మలయాళ సినిమాతో అరంగేట్రం చేసిన నయన్.. 2006లో టాలీవుడ్​లో వెంకటేశ్ సరసన నటించిన లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఎంట్రీయే స్టార్ హీరోతో చేసిన నయన్ ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస బ్లాక్​బస్టర్లు.. స్టార్ హీరోలతో కలిసి నటించింది. తమిళ, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో లేడీ సూపర్​స్టార్​గా ఎదిగింది. రెమ్యునరేషన్​ విషయంలో హీరోలు, హీరోయిన్లకు తారతమ్యాలు చూయించడం నచ్చని నయన్.. తన పాత్రకు తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వకపోతే ఆ సినిమాలకు నో చెప్పేది. ఇలా పలు మూవీస్ తన చేతిలో నుంచి జారిపోయినా మాట మీదే నిలబడుతూ వచ్చింది.

- Advertisement -
Nayanthara
Nayanthara

ఇక తమిళ్ మూవీ నేనూ రౌడీనే సినిమా దర్శకుడు విఘ్నేశ్ శివన్​తో ప్రేమలో పడింది నయనతార. కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తాము తల్లిదండ్రులమయ్యామని ఈ జంట షాక్ ఇచ్చింది. సరోగసీ విధానంలో పిల్లల్ని కన్నామని చెప్పింది. ఈ క్రమంలోనే వివాదంలో చిక్కుకున్న ఈ లవ్ కపుల్.. ఐదేళ్ల క్రితమే తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్ ఇచ్చారు.

గత కొద్ది కాలంగా వివాదాలతో సావాసం చేస్తోంది నయనతార. ఒక సమస్య పోతే మరో సమస్యలో చిక్కుకుంటోంది. ఇప్పుడు పిల్లలు కూడా పుట్టడంతో ఈ చికాకులన్నీ లేకుండా హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటుందట ఈ బ్యూటీ. అందుకే కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే చిరంజీవి గాడ్​ఫాదర్ మూవీతో అలరించిన నయనతార ప్రస్తుతం.. షారుఖ్‌ ఖాన్‌ సరసన జవాన్‌ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్​ తుది దశకు చేరుకుంది. ఇది పూర్తైన తర్వాత నయనతార మాధవన్‌ హీరోగా నటిస్తున్న ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. కొత్త దర్శకుడు శశికాంత్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ తర్వాత ఇక నయన్​ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలనుకుంటుందట. అందుకే ఇక ఏ సినిమాలు, ఎండార్స్‌మెంట్స్‌ ఒప్పుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here