Nayanthara : 20 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం మామూలు విషయం కాదు.. : నయనతార

- Advertisement -

Nayanthara : లేదని.. కంటెంట్ ఉంటే చాలు ఆదరిస్తున్నారని లేడీ సూపర్ స్టార్ నయనతార అన్నారు. సినిమా రంగంలో 20 ఏళ్ల నుంచి నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదని.. ఈ విషయంలో మొదటి నుంచి తనకు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.  

నయనతార నటించిన తాజా చిత్రం ‘కనెక్ట్’.  ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్‌ సినిమా ప్రేక్షకాదరణను భలే థ్రిల్ చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకులను కూడా మెప్పించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అలరించిన ఈ సినిమా విజయంపై నయనతార హర్షం వ్యక్తం చేసింది. ఓ ప్రముఖ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తోందని.. ప్రేక్షకులు కూడా ఈ మూవీని ఆదరించడం చూస్తుంటే ముచ్చటేస్తోందని చెప్పింది.

Nayanthara
Nayanthara

ఈ ఏడాది పూర్తిస్థాయి బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నట్లు నయనతార చెప్పింది. ఇక ‘కనెక్ట్‌’ సినిమాను బీటౌన్‌లోనూ విడుదల చేయడం పై మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ చిత్రం చిన్నదా.. పెద్దదా లేదా పాన్‌ ఇండియా స్థాయా అని ఆలోచించడం లేదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు సినీప్రియులందరూ కథ బాగుంటే ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అందుకే మేం ‘కనెక్ట్‌’ మూవీని మూడు భాషల్లో విడుదల చేశాం. ప్రేక్షకులు దీనిని మంచి సినిమా అని భావించారు. అందుకే విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి విజయాన్ని అందించారు’’ అని చెప్పింది. 

- Advertisement -

ఇక తన ఇరవై ఏళ్ల సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘‘చిత్ర రంగంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగడమన్నది చిన్న విషయం కాదు. నా సినీ ప్రయాణంలోనూ ఒడుదొడుకులున్నాయి. ఇప్పుడు అంతా బాగుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని నయన్ వివరించింది.  తనను ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. విజయంతోపాటు బాధ్యత మరింత పెరుగుతుందని, తన ప్రమాణాలను ఎప్పుడూ కాపాడుకుంటానని పేర్కొంది.

ప్రస్తుతం ఈ అందాలతార బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్ ఖాన్‌‌ సరసన ‘జవాన్‌’ సినిమాలో నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ అతిథి పాత్రలో మెరవనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here