Nayanthara : ఆ లిప్ లాక్ తో నయన్ డిప్రెషన్ లోకి వెళ్లిందట.. ఎందుకో తెలుసా?జీవా- Nayanthara నటించిన ‘తిరునాళ్’ ఫ్లాప్ మూవీల జాబితాలో చేరింది. అయినా.. ఈ సినిమా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. విశ్లేషణలపై విశ్లేషణలు..

1990 లో వచ్చిన సినిమాలను ఇంటిల్లిపాది చూసేవారు..కానీ 2000 తర్వాత వచ్చిన సినిమాలు బూతులకు,శృంగారానికి కేరాఫ్ గా మారాయి.ఆ సినిమాలు యువతను తప్పు ద్రొవ పట్టించేలా ఉన్నాయని విమర్శలు కూడా అందుకున్నాయి..ఇక ఈ మధ్య వస్తున్న సినిమాలకు అడ్డు లేకుండా పోయింది..రొమాంటిక్ కంటెంట్ తో పాటు, శృతి మించిన శృంగార భరిత సీన్లు ఎక్కువ అయ్యాయి.వాటి వల్ల యువత చెడి పోతున్నారు..అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

హీరోయిన్లకు డబ్బు ఆశ చూపించి మరీ ఇలాంటి సీన్లు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది..ఇక విషయాన్నికొస్తే.. లిప్ లాక్ సీన్ల వల్ల విమర్శలు అందుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు..ఆ సినిమా విడుదల సమయం లో బ్యాన్ చెయ్యాలని ఫిర్యాదులు కూడా అందాయి..అలాంటి సినిమాలలో లేడీ బాస్ నయనతార సినిమా కూడా ఒకటి ఉంది. ఆ సినిమా వల్ల ఆమె డిప్రెషన్ లోకి కూడా వెల్లిందని అప్పటిలో టాక్ ..ఆ సినిమా గురించి కాస్త వివరంగా..

జీవా- నయనతార నటించిన ‘తిరునాళ్’ ఫ్లాప్ మూవీల జాబితాలో చేరింది. అయినా.. ఈ సినిమా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. విశ్లేషణలపై విశ్లేషణలు.. విమర్శలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిందంతా అని అడిగితే.. ఈ చిత్రంలో ఓ స్కూల్ పిల్లాడు హీరోయిన్ నయన్‌ పెదాలను మద్దాడ్డమే. ‘తిరునాళ్’లో నయన్ స్కూల్ టీచర్. ఐదేళ్లలోపు విద్యార్థులంతా వరుసగా ఆమె బుగ్గపై ముద్దిలిచ్చుకుంటూ వెళ్తుంటారు..

Nayanthara
Nayanthara Tirunal Movie

ఓ కుర్రాడు హీరోయిన్ ముఖం తనవైపు తిప్పుకుని మరీ పెదాలపై కిస్ పెట్టేస్తాడు. ఈ సీన్ చిన్నపిల్లలకు తప్పుడు సంకేతాలిచ్చేదిగా ఉందంటూ ఇప్పుడు రచ్చ జరుగుతోంది. దీంతో.. ‘తిరునాళ్’ ఉధృతంగా వార్తల్లో నానుతోంది. ఇక.. ఈ లిప్ లాక్‌పై దర్శకుడు మనాధన్ స్పందించారు. ఈమధ్యకాలంలో చిన్న చిన్న విషయాలను బూతద్దంలో చూడటం, వివాదాస్పదం చేయడం ఫ్యాషనైపోయిందని అన్నాడు. ఈ సీన్ లో చిన్నాపిల్లాడి అమాయకత్వం ఉంటుందని ఈ దృశ్యానికి ముందూవెనకా వచ్చే కాంటెక్స్ట్‌ను దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాడు.అయితే చూపరులకు మాత్రం ఇది బూతులాగే కనిపించింది.

ఈ సీన్ లో అభ్యంతరకరమైన విషయం ఉంటే.. సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతిస్తుంది.. నయనతార మాత్రం ఎందుకు చేస్తుంది అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఈ సంగతి పక్కనపెడితే.. ఫ్లాప్ అయిన తమ మూవీపై బజ్ పెంచేందుకే చిత్రబృందం ఇలా ఈ లిప్ లాక్‌ను థర్డ్ పార్టీతో పైకి తీసుకొచ్చి ఉంటుందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.. ఏది ఏమైనా ఆ సినిమా మాత్రం నయన్ లైఫ్ కు ఎఫెక్ట్ అయ్యిందని చెప్పాలి..దాని తర్వాత అమ్మడు బోల్డ్ కంటెంట్ సినిమాలకు దూరం అయ్యిందని ఇండస్ట్రీలో టాక్.. ప్రస్తుతం నయన్ పెళ్ళి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది.అయితే ఆమె లైప్ ఎన్నో వివాదాలను సవాల్ గా తీసుకుంది..రెండు,మూడు ప్రాజెక్టులను చేస్తుంది.

Tags: