Nayanatara: టాలీవుడ్​ స్టార్​ హీరోల గురించి నయనతార ఏమందో తెలుసా..?



Nayanatara : లేడీ సూపర్ స్టార్ నయనతార టాలీవుడ్​లో వెంకటేశ్​ సరసన నటించిన లక్ష్మి సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత అగ్రహీరోలు నాగార్జున, బాలకృష్ణలతో.. యంగ్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్​లతో నటించింది. కానీ మెగాస్టార్ చిరంజీవితో నటించడానికి మాత్రం నయనతారకు ఛాన్స్ రాలేదు. ఇండస్ట్రీకి వచ్చిన చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ కుదిరింది. అది కూడా హీరోహీరోయిన్లుగా కాదు. అన్నాచెళ్లెల్లుగా. గాడ్​ఫాదర్ మూవీలో ఈ ఇద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Nayanatara
Nayanatara

ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత స్టార్​డమ్ ఉన్నా.. ఈ లేడీ సూపర్​స్టార్ సినిమా ప్రమోషన్స్​లో పాల్గొనదు. కనీసం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా కనిపించదు. సినిమాలో నటించడం వరకే తన పని అన్నట్లుగా ఉంటుంది. దాని తర్వాత తన పర్సనల్ లైఫ్​లో తను బిజీ అయిపోతుంది. ఈ భామ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చాలా అరుదు. ఎప్పుడూ మీడియా ముందుకు రాదు. ఇంత గొప్ప సెలబ్రిటీ అయినా లైమ్ లైట్​లో ఉండాలని కోరుకోదు. తన క్యారెక్టర్​తో నయన్ ఎంతో మంది ఫ్యాన్స్​ను సొంతం చేసుకుంది.

Actress
Actress

నయనతార దాదాపు పదేళ్ల తర్వాత సినిమా పరంగా కాకుండా కెమెరా ముందుకు వచ్చింది. అది కూడా టాలీవుడ్​కు. పదేళ్ల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది నయన్. తన తదుపరి చిత్రం ‘కనెక్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా నయన్‌తో సుమ స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సినిమా విశేషాలతోపాటు టాలీవుడ్‌ హీరోల గురించి ఆమె ఎన్నో విషయాలు పంచుకుంది. మరి ఈ బ్యూటీ టాలీవుడ్​లో హీరోల గురించి ఏం చెప్పిందో తెలుసా..?

ప్రీ రిలీజ్‌లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి?

నయనతార: నీతో ఇంటర్వ్యూలో పాల్గొనాలనుకున్నా. కానీ, నువ్వు ఫుల్‌ బిజీగా ఉంటున్నావు కదా. అందుకే నేను కూడా వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకు రాలేదు.

వెంకటేశ్‌తో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నయనతార: ఆయన నా మొదటి తెలుగు హీరో. మేమిద్దరం ఎన్నో సినిమాలు చేశాం. ఆయనతో సెట్‌లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్లు ఉంటుంది. ఒక పెద్ద హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాననే భావన కలగదు.

నాగార్జునను ఒక్క పదంలో అభివర్ణించాలంటే ఏం చెబుతారు?

నయనతార: అందగాడు.

నయనతార: అగ్రనటుడు అయినప్పటికీ మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌డమ్‌ను చూపించరు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం ఆయనది. నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు.

రవితేజ..?

నయనతార: రవితేజ నేనూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే కాకపోతే ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండటం.. ఈ మధ్య కాలంలో మేమిద్దరం కలవకపోవడం వల్ల కాస్త మాటలు తగ్గాయి. సెట్‌లో ఉన్నప్పుడు హిందీలోనే మాట్లాడుకునేవాళ్లం.

ప్రభాస్‌..?

నయనతార: ప్రభాస్‌ స్వీట్‌ హార్ట్‌‌. సెట్‌లో బాగా అల్లరి చేసేవాడు. ఎంతో సరదాగా మాట్లాడేవాడు. ఇప్పుడు అతడు పెద్దస్టార్‌ అయ్యాడు. ఆనందంగా ఉంది.

ఎన్టీఆర్‌..?

నయనతార: తారక్‌ బాగా అల్లరి చేస్తాడు. నాపై జోక్స్‌ వేసేవాడు. ఓసారి సెట్‌లో నేను రెడీ అవుతున్నప్పుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చూస్తున్నావు? అని అడగ్గా.. ‘ఎందుకు అంతలా మేకప్‌ వేసుకుంటున్నావు’ అని ప్రశ్నించాడు. షాట్‌కు వెళ్లాలి కదా. అందుకే అని చెప్పా. దానికి ఆయన.. ‘స్క్రీన్‌పై నేను ఉన్నప్పుడు అందరూ నన్నే చూస్తారు కదా. ఇంకా నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది’ అని సరదాగా జోక్స్‌ వేశాడు. మంచి డ్యాన్సర్‌. రిహార్సల్స్‌ చేయకుండానే డ్యాన్స్ చేస్తాడు.

బాలయ్య..?

నయనతార: బాలయ్య సరదా మనిషి. ఆయనతో మాట్లాడటానికి అందరూ భయపడతారు కానీ ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరితో సరదాగా మాట్లాడతారు.

https://youtu.be/uavDatwurLI